West Bengal: భర్త కిడ్నీ విక్రయించి ప్రియుడితో పరార్
ABN , Publish Date - Feb 03 , 2025 | 05:29 AM
హవ్‌డా జిల్లా శంకరైల్ గ్రామానికి చెందిన ఆ మహిళ భర్తకు తీయనిమాటలు చెప్పి చివరకు మోసగించింది. అన్ని కుటుంబాలు మాదిరిగానే వారికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి.

రూ.10 లక్షలతో ఉడాయించిన భార్య
కిడ్నీ అమ్మితే ఆర్థిక ఇబ్బందుల నుంచి
బయటపడొచ్చంటూ మాయమాటలు
బిడ్డ చదువు, పెళ్లి చేద్దామని సూచన
పశ్చిమబెంగాల్‌లో ఘటన
కోల్‌కతా, ఫిబ్రవరి 2: భర్త కిడ్నీ విక్రయించి, వచ్చిన సొమ్ము తీసుకొని ప్రియుడితో పరారైన ఓ భార్యామణి ఉదంతం పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. హవ్‌డా జిల్లా శంకరైల్ గ్రామానికి చెందిన ఆ మహిళ భర్తకు తీయనిమాటలు చెప్పి చివరకు మోసగించింది. అన్ని కుటుంబాలు మాదిరిగానే వారికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. వాటి నుంచి బయట పడాలంటే కిడ్నీని విక్రయించాలని భర్తకు చెప్పి చూసింది. వచ్చిన సొమ్మును బ్యాంకులో వేసుకుంటే కుమార్తె చదువులు, పెళ్లికి సమస్యలు ఉండవని నచ్చజెప్పింది. నిజమే అని నమ్మిన అతడు ఏడాది పాటు వెతికి ‘కిడ్నీ కొనుగోలుదారుడు’ను పట్టుకున్నాడు. మూడు నెలల క్రితం కిడ్నీ అమ్మకం జరిగింది. ఇందుకు రూ.10 లక్షలు తీసుకున్నాడు. అనంతరం భార్య మోసం బయటపడింది. ఈ మొత్తం సొమ్ము తీసుకొని ఆ భార్య ప్రియుడితో పరారయింది. బారక్‌పూర్‌కు చెందిన ఓ పెయింటర్‌కు ఫేస్‌బుక్ ద్వారా ఆమెకు పరిచయం ఏర్పడింది. చివరికది ప్రేమగా మారింది. లబోదిబోమన్న ఆ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బారక్‌పూర్‌లో ఉన్నారని తెలుసుకొని పదేళ్ల కుమార్తె, తల్లిదండ్రులు, బంధువులను తీసుకొని అక్కడికి వెళ్లాడు. వారిని చూసి ఇంటి తలుపు వేసుకున్న ఆమె ఎంతకూ తీయలేదు. వారితో మాట్లాడడానికి బయటకు రాలేదు. పైగా ఏమి చేసుకుంటారో చేసుకోండని బెదిరించింది. విడాకులు ఇస్తానని భర్తను హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి..
Sonia Gandhi: సోనియా గాంధీపై కోర్టులో ఫిర్యాదు చేసిన న్యాయవాది.. ఎందుకంటే..
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు భక్తజనం.. ఫిబ్రవరి 1 నాటికి ఎంత మంది వచ్చారంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి