Share News

Vice President of India: కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు

ABN , Publish Date - Jul 23 , 2025 | 03:17 AM

ఈ వర్షాకాల సమావేశాల్లోనే కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది.

Vice President of India: కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు
Vice President of India

  • తెరపైకి నితీశ్‌, హరివంశ్‌, నడ్డా, థరూర్‌ పేర్లు!

న్యూఢిల్లీ, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ఈ వర్షాకాల సమావేశాల్లోనే కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. తదుపరి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలా అనే అంశంపై అటు మోదీ ప్రభుత్వం, ఇటు విపక్షాలు మంతనాలు మొదలుపెట్టాయి. బిహార్‌ ఎన్నికల నేపథ్యంలో.. ఆ రాష్ట్ర సీఎం నీతీశ్‌ కుమార్‌ లేదా ప్రస్తుతం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న జేడీయూ నేత హరివంశ్‌లో ఎవరో ఒకరిని ఎన్డీయే కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలిపే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా జగత్‌ ప్రకాశ్‌ నడ్డా స్థానంలో మరొకర్ని నియమించనున్నందువల్ల.. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నడ్డాకే అవకాశం ఇవ్వొచ్చనే వాదన కూడా బీజేపీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకు.. కాంగ్రెస్‌ అసమ్మతి నేత శశిథరూర్‌ను నిలబె ట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 03:17 AM