Share News

West Bengal Shocking Incident: షాకింగ్ ఘటన.. భార్య ముక్కు అందంగా ఉందన్నాడు.. చివరకు

ABN , Publish Date - May 05 , 2025 | 11:41 AM

West Bengal Shocking Incident: పశ్చిమబెంగాల్‌లో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఇది ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. భార్య పట్ల భర్త వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది.

West Bengal Shocking Incident: షాకింగ్ ఘటన.. భార్య ముక్కు అందంగా ఉందన్నాడు.. చివరకు
West Bengal Shocking Incident

పశ్చిమబెంగాల్, మే 5: భార్య అందంగా ఉండాలని ఏ భర్త కోరుకోడు చెప్పండి. తన జీవింతంలోకి రాబోయే సతీమణి అందరికంటే అందంగా ఉండాలని.. గుణవంతురాలు కావాలని కలలు కంటాడు. చాలా మందికి ఆ కల నెరవేరుతుంది కూడా. అందమైన భార్య వచ్చిందంటే అంతకంటే అందంగా తమ జీవితాన్ని సాఫీగా సాగిస్తుంటారు. కానీ కొందరు మాత్రం విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. భార్య అందాల రాశి అయితే అనుమానం పిచ్చితో వేధిస్తుంటారు. అంతే కాకుండా అవసరమైతే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. ఇటీవల మన దేశంలో ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. కానీ ఇప్పుడు మన చెప్పుకోబోయే ఘటన మాత్రం విచిత్రంగానే కాదు.. షాక్‌కు గురిచేస్తుంది కూడా. ఆ భర్తకు తన భార్య ముక్కు అంటే ఎంతో ఇష్టం. ‘నీ ముక్కు చాలా బాగుంది.. ఎప్పుడో ఓసారి కొరుక్కు తినేస్తాను’ అంటూ తరుచూ చెబుతుండే వాడు కూడా. ఏదో సరదాకు అంటున్నాడులే అని ఆ భార్య కూడా లైట్‌ తీసుకుంది. కానీ అతడు అన్నంత పని చేస్తాడని ఆ భార్య ఏ మాత్రం ఊహించలేకపోయింది. సరదాగా అన్న మాట నిజం కావడంతో భార్య లబోదిబోమని మొత్తుకుంటోంది. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.


వెస్ట్‌బెంగాల్ రాష్ట్రంలోని నదియా జిల్లా శాంతీపుర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బేర్పారాలో భార్యాభర్తలు బాపన్ షేక్, మధు ఖాతూన్ నివాసముంటున్నారు. భార్య మధు ఖాతూన్ అంటే భర్తకు చాలా ఇష్టం. ముఖ్యంగా ఆమె ముక్కు అంటే అతగాడికి తెగ ఇష్టమట. అవకాశం ఉంటే కొరుక్కు తింటానంటూ తరచూ అనేవాడట కూడా. కానీ అన్నంత పని చేస్తాడని మాత్రం భార్య ఊహించలేకపోయింది. ఈనెల 2న అర్థరాత్రి బాపన్ షేక్, మధు ఖాతూన్ ఇంట్లో నుంచి అరుపులు, కేకలు వినిపించాయి. దీంతో స్థానికులు ఏం జరిగిందా అని ఆ ఇంటికి వద్దకు వచ్చారు. ఇంతలోనే మధు ఖాతూన్ ఏడుస్తూ బయటకు వచ్చింది. ఆమె ముక్కు నుంచి విపరీతంగా రక్తం స్రావం అవుతోంది. ఏం జరిగిందని స్థానికులు ప్రశ్నించగా.. ఆమె చెప్పి సమాధానం విని అంతా అవాక్కయ్యారు. ఇదేం పని అంటూ ముక్కున వేలేసుకున్న పరిస్థితి.

Drunk Driving Incident: మద్యం తాగుతూ ఫుల్ స్పీడ్‌తో బైక్ రైడ్.. వీడియో వైరల్


భార్య పడుకున్న సమయంలో భర్త బాపన్ షేక్ ఆమె ముక్కును కొరికేశాడు. అంతే కాకుండా కొరికేసిన ముక్కును తినేశాడు కూడా. విషయం తెలిసిన స్థానికులు షాక్‌కు గురయ్యారు. వెంటనే మధు ఖాతూన్‌‌ను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై తల్లితో కలిసి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘నీ ముక్కు అందంగా ఉంది.. అవకాశం దొరికితే కొరికి తినేస్తానని నా భర్త అనే వాడు. చివరకు అన్నంత పని చేశాడు’ అని పోలీస్ స్టేషన్‌లో భార్య మధు ఖాతూన్ ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలిసిన పోలీసులు కూడా అవాక్కైన పరిస్థితి. చివరకు భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే భార్య ముక్కును కొరికేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఏది ఏమైనా అందంగా ఉన్న భార్యను చూసి మురిసిపోవాల్సింది పోయి.. ఇదెక్కడి జోద్యం అంటూ ప్రజలు విస్తుపోతున్న పరిస్తితి.


ఇవి కూడా చదవండి

Metro Fare Rise: 10 నుంచి మెట్రో చార్జీల పెంపు

Donald Trump: విదేశాల్లో నిర్మించిన చిత్రాలపై 100% సుంకం..ఆ జైలు తిరిగి ప్రారంభిస్తాం

Read Latest National News And Telugu News

Updated Date - May 05 , 2025 | 12:06 PM