Man Ties Wifes Body to bike: హృదయవిదారకం.. యాక్సిడెంట్ తర్వాత భార్య శవాన్ని బైక్‌కు కట్టి తీసుకెళ్లిన భర్త..
ABN , Publish Date - Aug 11 , 2025 | 01:34 PM
నాగ్‌పూర్‌లో హృదయవిదారక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కన్నీళ్లు పెట్టించే ఓ ఘటన చోటు చేసుకుంది. ఎవరూ సహాయం చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఓ వ్యక్తి తన భార్య మృతదేహాన్ని బైక్‌కు కట్టుకుని తీసుకెళ్లిన విషాద ఘటన నాగ్‌పూర్‌లో వెలుగులోకి వచ్చింది.
నాగ్‌పూర్(Nagpur)లో హృదయవిదారక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టకు మానరు. ఎవరూ సహాయం చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఓ వ్యక్తి తన భార్య మృతదేహాన్ని బైక్‌కు కట్టుకుని తీసుకెళ్లిన విషాద ఘటన నాగ్‌పూర్‌లో వెలుగులోకి వచ్చింది. నాగ్‌పూర్-జబల్‌పూర్ జాతీయ రహదారిపై ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది (Man Ties his Wifes Body To Bike).
నాగ్‌పూర్- జబల్‌పూర్ జాతీయ రహదారిపై అమిత్ తన భార్యతో కలిసి ప్రయాణిస్తున్నాడు. అమిత్ భార్య తన సోదరుడికి రాఖీ కట్టేందుకు వెళ్తోంది. డియోలాపర్ పోలీస్ స్టేషన్ పరిధి మోర్ఫాటా సమీపంలో ఆదివారం మధ్యాహ్నం వారు ప్రయాణిస్తున్న బైక్‌ను ఓ ట్రక్కు ఢీకొట్టింది. వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొనడంతో అమిత్ భార్య అక్కడికక్కడే మరణించింది. ప్రమాదం తర్వాత అమిత్ ఆ రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను సహాయం కోరాడు. కానీ ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. దీంతో చేసేదేం లేక భార్య మృతదేహాన్ని తన బైక్‌కు కట్టుకున్నాడు.
భార్య మృతదేహాన్ని బైక్‌కు కట్టుకుని హైవే మీద ప్రయాణించాడు. అతడిని చూసి కొందరు వాహనదారులు ఆపేందుకు ప్రయత్నించారు. అయితే ఏ కారణం చేతనో అమిత్ మాత్రం బైక్ ఆపకుండా నేరుగా తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు. ఆ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ హృదయవిదారక ఘటన చాలా మందికి కన్నీళ్లు తెప్పిస్తోంది.
ఇవి కూడా చదవండి
హైడ్రా మార్షల్స్ విధులకు బహిష్కరణ.. ఎమర్జెన్సీ సేవలకు బ్రేక్
నైట్ క్లబ్‌లో కాల్పుల కలకలం.. 8 మంది మృతి..
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..