Nightclub Shooting: నైట్ క్లబ్‌లో కాల్పుల కలకలం.. 8 మంది మృతి..
ABN , Publish Date - Aug 11 , 2025 | 11:32 AM
Nightclub Shooting: ఆదివారం తెల్లవారు జామున నపోల్స్ నైట్ క్లబ్ బయట కొంతమంది కస్టమర్లు మందు తాగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు.
ఈక్వెడార్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ నైట్ క్లబ్‌లో కాల్పుల కలకలం చెలరేగింది. ఈ సంఘటనలో 8 మంది మృత్యువాతపడ్డారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సాంటా లూసియా టౌన్‌లో గ్యాంగ్ వాయిలెన్స్ బాగా ఎక్కువైపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రెసిడెంట్ డేనియల్ నోబోవా గత వారం ఎమర్జెన్సీ ప్రకటించారు. గ్యాంగ్ వాయిలెన్స్‌కు చెక్ పెట్టాలని భావించారు.
అయితే, గ్యాంగ్ వాయిలెన్స్ తగ్గకపోగా.. మరింత పెరిగింది. ఆదివారం తెల్లవారు జామున నపోల్స్ నైట్ క్లబ్ బయట కొంతమంది కస్టమర్లు మందు తాగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. అనంతరం అక్కడినుంచి పారిపోయారు. ఈ కాల్పుల్లో ఏడు మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరు చికిత్స పొందుతూ చనిపోయారు. మిగిలిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
చనిపోయిన వారిలో నైట్ క్లబ్ ఓనర్ జార్జ్ ఉర్క్విజో, మేయర్ సోదరుడు కూడా ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాల్పులకు గల కారణాలు ఏంటో పోలీసులకు ఇంకా తెలియరాలేదు. కాగా, 2025 సంవత్సరం మొదలైన నాటినుంచి ఇప్పటి వరకు ఏకంగా 4,619 హత్యలు జరిగాయి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 47 శాతం పెరిగాయి. 2023 నుంచి హత్యలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రతీ ఏడాది హత్యలు పెరుగుతూ పోతున్నాయే తప్ప తగ్గటం లేదు.
ఇవి కూడా చదవండి
బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు హాజరైన రానా దగ్గుబాటి
ఏపీ ప్రభుత్వంతో సినిమా ప్రముఖుల భేటీ.. ఎందుకంటే