Election Commission: జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం
ABN , Publish Date - May 02 , 2025 | 05:03 AM
ఓటరు జాబితా ఖచ్చితంగా ఉండేందుకు జనన-మరణ రికార్డులతో అనుసంధానం చేయనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. వీవీఐఎస్ లో వివరాలు స్పష్టంగా కనిపించేలా పెద్ద అక్షరాల్లో ముద్రించడంతో పాటు, బూత్ స్థాయి అధికారులకు ఫొటో ఐడీలు జారీ చేయనున్నారు.
ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకత పెంచడానికే..
ఆర్‌జీఐ నుంచి నేరుగా మరణాల సమాచారం
వెంటనే బీఎల్వోలతో క్షేత్రస్థాయిలో ధ్రువీకరణ
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ, మే 1: జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితాను అనుసంధానం చేయబోతున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. తద్వారా ఓటరు జాబితాను కచ్చితత్వంతో నవీకరించడంతో పాటు ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకత పెంచడానికి వీలవుతుందని పేర్కొంది. ఇందుకోసం మరణాలకు సంబంధించిన సమాచారాన్ని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్‌జీఐ) నుంచి ఎలకా్ట్రనిక్ రూపంలో ఎప్పటికప్పుడు పొందుతామని తెలిపింది. మరణించిన వారి కుటుంబాల నుంచి సమాచారం వచ్చే వరకు వేచిచూడకుండా.. ఆర్‌జీఐ నుంచి సమాచారం వచ్చిన వెంటనే బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి సమాచారాన్ని ధ్రువీకరించుకుంటారని ఎన్నికల సంఘం వెల్లడించింది. అలాగే ఓటరు సమాచార చీటీ (వీఐఎస్) ఓటర్లకు మరింత స్పష్టంగా కనిపించేందుకు వీలుగా అందులోని వివరాలను పెద్ద అక్షరాలతో ఉండేలా రూపొందించాలని ఈసీ నిర్ణయించింది. తద్వారా ఓటర్లు తమ పోలింగ్ కేంద్రాన్ని తేలికగా గుర్తించడంతో పాటు పోలింగ్ అధికారులు కూడా జాబితాలోని పేర్లను సులభంగా చూసుకునేందుకు సౌకర్యంగా ఉంటుందని తెలిపింది. దీంతో పాటు బూత్ స్థాయి అధికారులకు ఫొటో ఐడీ కార్డు జారీ చేయాలని నిర్ణయించిన ట్లు తెలిపింది.
ఇవి కూడా చదవండి
ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం
PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు
Read Latest AP News And Telugu News