ప్రారంభమైన 23వ శిఖరాగ్ర సమావేశం
ABN , First Publish Date - Dec 05 , 2025 | 11:02 AM
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటన భారత్‌లో రెండో రోజు కొనసాగుతోంది. ఇండియాలో పర్యటించేందుకు ఆయన నిన్న(గురువారం) సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. పుతిన్ పర్యటనకు సంబంధించి మినిట్ టు మినిట్ లైట్ అప్డేట్స్ కోసం ఇక్కడ చూడండి..
Live News & Update
-
Dec 05, 2025 15:17 IST
భారతదేశం బ్రిక్స్ అధ్యక్ష పదవిని చేపడుతుంది: పుతిన్
బ్రిక్స్ రాష్ట్ర వ్యవస్థాపకులుగా, రష్యా మరియు భారతదేశం చాలా పనులు చేశాయి
సంస్థ యొక్క అధికారాన్ని పెంచడానికి మరిన్ని చేస్తూనే ఉన్నాయి
వచ్చే ఏడాది భారతదేశం బ్రిక్స్ అధ్యక్ష పదవిని చేపడుతుంది
భారతీయ స్నేహితులకు అవసరమైన అన్ని సహాయాన్ని అందిస్తాం
-
Dec 05, 2025 15:15 IST
రష్యా లేదా బెలారస్ నుండి హిందూ మహాసముద్ర తీరానికి ఉత్తర-దక్షిణ రవాణాను సృష్టించే ప్రాజెక్ట్‌తో సహా కొత్త అంతర్జాతీయ రవాణా మార్గాలను నిర్మించడానికి మేము మా భారతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నాము: పుతిన్
-
Dec 05, 2025 15:06 IST
పెరుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థ కోసం నిరంతరాయంగా ఇంధన రవాణాను కొనసాగించడానికి మేము సిద్ధంగా ఉన్నాము: పుతిన్
-
Dec 05, 2025 15:03 IST
రష్యా పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ
-
Dec 05, 2025 15:00 IST
భారతదేశం, రష్యా మధ్య ఒప్పందాల మార్పిడికి సాక్ష్యంగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
-
Dec 05, 2025 15:00 IST
articleText
-
Dec 05, 2025 14:54 IST
భారత్ ఆతిథ్యం ఎంతో సంతోషాన్నిచ్చింది: పుతిన్
అనేక అంశాల్లో ఇరుదేశాల మధ్య అవగాహన కుదిరింది: పుతిన్
విభిన్న అంశాలపై పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నాం: పుతిన్
భారత్-రష్యా మధ్య 64 బిలియన్ డాలర్ల వ్యాపారం: పుతిన్
ఇరుదేశాల మధ్య ట్రేడ్ మరింత పెంచేందుకు యత్నాలు
ఆయిల్ సహా అన్నిరంగాల్లో సహకారం అందిస్తాం: పుతిన్
-
Dec 05, 2025 14:53 IST
విశ్వాసంతో భారత్-రష్యా బంధం కొనసాగుతోంది: ప్రధాని మోదీ
2030 వరకు భారత్-రష్యా ఎకనామిక్ కో-ఆపరేషన్ ప్రోగ్రాం: ప్రధాని మోదీ
ఆర్థిక రంగంలో భారత్-రష్యా సంబంధాలను నూతన స్థాయికి తీసుకెళ్తాం
అంతర్జాతీయ వేదికలపై ఇరుదేశాలు కలిసి పనిచేస్తాయి: మోదీ
రష్యా నుంచి వచ్చే పర్యాటకులకు వీసాలో వెసులుబాటు: మోదీ
ఇరుదేశాల క్రీడాకారులు, విద్యార్థుల మధ్య పరస్పర సహకారం
ఉక్రెయిన్ విషయంలో భారత్ ఎప్పుడూ శాంతి పక్షానే ఉంది: మోదీ
ఉగ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాలి: మోదీ
ఉగ్రవాదంపై ఇరుదేశాలు సుదీర్ఘకాలంగా పోరాడుతున్నాయి: మోదీ
-
Dec 05, 2025 14:46 IST
ప్రధాని మోదీ ప్రసంగం- LIVE
-
Dec 05, 2025 12:23 IST
ప్రారంభమైన 23వ శిఖరాగ్ర సమావేశం
ఢిల్లీ: హైదరాబాద్ హౌస్‌కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్
హైదరాబాద్ హౌస్‌లో పుతిన్‌కు స్వాగతం పలికిన ప్రధాని మోదీ
ప్రధాని మోదీ, పుతిన్ మధ్య ప్రారంభమైన 23వ శిఖరాగ్ర సమావేశం
-
Dec 05, 2025 11:49 IST
గాంధీకి నివాళులర్పించిన పుతిన్..
రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులర్పించిన పుతిన్
కాసేపట్లో హైదరాబాద్ హౌస్‌లో భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశం
భారత్-రష్యా మధ్య జరగనున్న 25 ఒప్పందాలు
-
Dec 05, 2025 11:25 IST
రాష్ట్రపతి భవన్‌కు పుతిన్
ఢిల్లీ: రాష్ట్రపతి భవన్ వద్ద రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఘనస్వాగతం
పుతిన్‌కు ఘనస్వాగతం పలికిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ
సైనికుల గౌరవ వందనం స్వీకరించిన రష్యా అధ్యక్షుడు పుతిన్
-
Dec 05, 2025 11:02 IST
భారత పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్
నేడు హైదరాబాద్ హౌస్‌లో శిఖరాగ్ర సమావేశం
భారత్-రష్యా మధ్య జరగనున్న 25 ఒప్పందాలు
రాజ్‌ఘాట్‌ను సందర్శించనున్న పుతిన్
ఉ.11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అధికారిక స్వాగతం