VK Shashikala Case: పెద్దనోట్ల రద్దు సమయంలో 450 కోట్లతో చక్కెర ఫ్యాక్టరీ కొన్న శశికళ
ABN , Publish Date - Sep 07 , 2025 | 05:53 AM
తమిళనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు వీకే శశికళపై మరో సీబీఐ కేసు నమోదయింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో రూ.450 కోట్లతో ఓ చక్కెర ఫ్యాక్టరినీ...
చెన్నై, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): తమిళనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు వీకే శశికళపై మరో సీబీఐ కేసు నమోదయింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో రూ.450 కోట్లతో ఓ చక్కెర ఫ్యాక్టరినీ కొనుగోలు చేశారని, తన బినామీల ద్వారా ఆ ఫ్యాక్టరీని నడిపారని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. కాంచీపురంలో ఉన్న ఓ చక్కెర ఫ్యాక్టరీ రూ.కోట్లు రుణం తీసుకొని మోసగించినట్లు ఇండియన్ ఓవరీస్ బ్యాంక్ మద్రాసు హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఆ పిటిషన్‌పై విచారణ జరిపి, కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమేరకు గత జూలైలో సీబీఐ అధికారులు పలుచోట్ల సోదాలు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ తయారు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్న దస్తావేజుల్లో శశికళకు సంబంధించిన చక్కెర ఫ్యాక్టరీ వ్యవహారాన్ని కూడా ప్రస్తావించింది. అంతేకాకుండా ఆ చక్కెర కర్మాగారాన్ని నడిపిన విదేశ్ శివగన్ పఠేల్ ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఆ చక్కెర కర్మాగారాన్ని కొనుగోలు చేసేందుకు రూ.450 కోట్ల విలువైన రద్దయిన పెద్దనోట్లను ఉపయోగించారని కూడా వివరించింది. ఆ చక్కెర కర్మాగారం బినామీ ఆస్తి అని, దాని స్వంతదారు శశికళ అని ఐటీ శాఖ ప్రకటించిన విషయాన్నీ సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
ముంబైను పేల్చేస్తామన్న వ్యక్తి 24 గంటల్లో అరెస్టు
అన్నాడీఎంకేలో ముదిరిన విభేదాలు.. సెంగోట్టియన్‌ను పార్టీ పదవుల నుంచి తొలగించిన ఈపీఎస్