Share News

Chennai News: కరూర్‌ క్షతగాత్రులకు రూ.2లక్షల సాయం

ABN , Publish Date - Oct 20 , 2025 | 10:27 AM

కరూర్‌లో సెప్టెంబర్‌ 27రాత్రి నిర్వహించిన రోడ్‌షోలో జరిగిన తొక్కిసలాటలో గాయపడినవారికి కూడా త్వరలోనే తలా రూ.2లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తామని టీవీకే నేత విజయ్‌ ప్రకటించారు. తొక్కిసలాటలో మృతి చెందిన 41 మంది కుటుంబాలకు ఆయన తలా రూ.20 లక్షల చొప్పున వారి బ్యాంక్‌ ఖాతాలలో జమచేసిన విషయం తెలిసిందే.

Chennai News: కరూర్‌ క్షతగాత్రులకు రూ.2లక్షల సాయం

- టీవీకే అధినేత విజయ్‌

చెన్నై: కరూర్‌లో సెప్టెంబర్‌ 27రాత్రి నిర్వహించిన రోడ్‌షోలో జరిగిన తొక్కిసలాటలో గాయపడినవారికి కూడా త్వరలోనే తలా రూ.2లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తామని టీవీకే(TVK) నేత విజయ్‌ ప్రకటించారు. తొక్కిసలాటలో మృతి చెందిన 41 మంది కుటుంబాలకు ఆయన తలా రూ.20 లక్షల చొప్పున వారి బ్యాంక్‌ ఖాతాలలో జమచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోడ్‌షోలో మందమందికి పైగా గాయపడి పలు ఆస్పత్రుల్లో చికిత్స పొంది కోలుకున్నారు.


nani1.2.jpg

ప్రభుత్వం వీరికి లక్ష రూపాయల నుండి రూ.50వేల చొప్పున ఆర్థికసాయం అందజేసింది. ఈ నేపథ్యంలో టీవీకే తరఫున క్షతగాత్రులకు తలా రూ.2లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని విజయ్‌ ఆదివారం మధ్యాహ్నం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం కరూర్‌ జిల్లాకు చెందిన పార్టీ నాయకులు గాయపడినవారి బ్యాంక్‌ ఖాతాలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారని, ఆ తరువాత ఖాతాల్లో తలా రూ.2లక్షలను జమ చేస్తామని విజయ్‌(Vijay) పేర్కొన్నారు.


nani1.3.jpg

కరూర్‌ దుర్ఘటన మృతుల కుటుంబీకులందరినీ త్వరలోనే తాను నేరుగా కలుసుకుని పరామర్శిస్తానని, ఆ దిశగానే పార్టీ నిర్వాహకులు పోలీసుల అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా శనివారం టీవీకే ద్వారా రూ.20లక్షల సాయం పొందిన మృతుల కుటుంబాలకు చెందిన కొందరు మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘనవిజయం సాధిస్తుందని, ఈ విషయంలో విజయ్‌ అధైర్యపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దీపావళి రోజున మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ముస్లింలకు అట్రాసిటీ చట్టం తీసుకురావాలి

Read Latest Telangana News and National News

Updated Date - Oct 20 , 2025 | 10:30 AM