Dharmendra Passes Away: బాలీవుడ్‌లో విషాదం.. ధర్మేంద కన్నుమూత
ABN , Publish Date - Nov 11 , 2025 | 08:59 AM
బాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు ధర్మేంద్ర(89) కన్నుమూశారు. శ్వాసకోశ సమస్యలతో ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ధర్మేంద్ర మరణంతో బాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది.
బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు ధర్మేంద్ర(89) కన్నుమూశారు. శ్వాసకోశ సమస్యలతో ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. భారతీయ సినిమా రంగంలో స్టార్ నటుల్లో ఒకరిగా పేరుగడించిన ధర్మేంద్ర మరణంతో బాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆయన్ను 2012లో పద్మ భూషణ్ పురస్కారం వరించింది. 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం లభించింది. త్వరలో విడుదల కానున్న ‘ఇక్కీస్’లో ఓ కీలక పాత్రలో ధర్మేంద్ర నటించడం విశేషం.
ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. ఆయన 1935 డిసెంబర్ 5వ తేదీన పంజాబ్ లో జన్మించారు. ధర్మేంద్ర ఇద్దరు భార్యలు ప్రకాశ్ కౌర్, హేమమాలిని. ప్రకాశ్ కౌర్‌ను వివాహం చేసుకోగా.. వారికి సన్నీ డియోల్, బాబీ డియోల్ సంతానం ఉన్నారు. అలానే ధర్మేంద్ర, హేమామాలిని జంటకు ఇషా డియోల్, ఆహానా డియోల్ జన్మించారు. అత్యంత ప్రాచుర్యం పొందిన 'షోలే'(1975)లో వీరూ పాత్రలో ధర్మేంద్ర అద్భుతంగా నటించారు.
షోలే సినిమా ఆయన సినీ కెరీర్‌ను ఓ మలుపు తిప్పింది. అలీబాబా ఔర్ 40 చోర్, దోస్త్, డ్రీమ్ గర్ల్, సన్నీ, గాయల్, లోఫర్, మేరా నామ్ జోకర్ వంటి చిత్రాల్లోనూ నటించారు. మొత్తం 100కుపైగా సినిమాల్లో ధర్మేంద్ర నటించారు. 2004లో రాజస్థాన్‌లోని బికనీర్ లోక్‌సభ స్థానం నుంచి నెగ్గి ఎంపీగా కూడా పని చేశారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
10 పరీక్షల ఫీజు చెల్లింపునకు 25 వరకు గడువు