Share News

RC Renewal: వాహనం రిజిస్టరై 20 ఏళ్లు దాటితే..

ABN , Publish Date - Feb 23 , 2025 | 05:09 AM

ముసాయిదాకు ఆమోదముద్ర పడితే.. ద్విచక్రవాహనాల రెన్యూవల్‌కు ఏడాదికి రూ.2వేలు, కార్లకు రూ.10 వేల మేర చార్జీల మోత మోగనుంది.

RC Renewal: వాహనం రిజిస్టరై 20 ఏళ్లు దాటితే..

ఏడాదికి బైక్‌కు రూ.2 వేలు.. కారుకు రూ.10వేలు

రిజిస్ట్రేషన్‌ రెన్యూవల్‌ చార్జీల పెంపునకు కేంద్రం ప్రతిపాదన

హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): 20 ఏళ్ల వయసు దాటిన వాహనాల రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌(ఆర్‌సీ) రెన్యూవల్‌ చార్జీలను పెంచాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఇటీవలే ముసాయిదాను విడుదల చేసింది. ముసాయిదాకు ఆమోదముద్ర పడితే.. ద్విచక్రవాహనాల రెన్యూవల్‌కు ఏడాదికి రూ.2వేలు, కార్లకు రూ.10 వేల మేర చార్జీల మోత మోగనుంది. అంటే.. వాహనం వయసు 20 ఏళ్లు దాటితే.. గతంలో మాదిరిగా ఐదేళ్లకు రెన్యూవల్‌ అవకాశం ఉండదు. ఏటా వాహనాన్ని రవాణాశాఖ కార్యాలయానికి తీసుకెళ్లి, ఫిట్‌నెస్‌ పరీక్షలో నెగ్గితేనే రెన్యూవల్‌ చేస్తారు. వీటితోపాటు.. ఆటోరిక్షాలు, ఇతర వాహనాల రెన్యూవల్‌ చార్జీలు కూడా దాదాపు రెండింతలు పెరగనున్నాయి. ప్రస్తుతం 15 ఏళ్లు దాటిన బైక్‌కు ఐదేళ్ల రెన్యూవల్‌కు రూ.2 వేలు, 20 ఏళ్లు దాటితే ఐదేళ్లకు రూ.5వేలుగా చార్జీలున్నాయి. 15 ఏళ్లు దాటిన కార్లకు ఐదేళ్ల రెన్యూవల్‌కు రూ.5 వేలు, 20 ఏళ్లు దాటితే రూ.10వేలుగా ఉంది.


ఇవి కూడా చదవండి..

Kerala: కేరళలో సంచలనం సృష్టిస్తున్న సామూహిక ఆత్మహత్యలు.. అసలేం జరిగిందంటే..

Delhi: ఛావా ఎఫెక్ట్.. సైన్‌బోర్డులపై బ్లాక్ స్ప్రే, శివాజీ పోస్టర్లు

Maha Kumbh Mela 2025: మహాకుంభ మేళా ఎఫెక్ట్.. ఫిబ్రవరి 25-28 వరకు ఈ రైళ్లు రద్దు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 23 , 2025 | 05:09 AM