Share News

Man Parents Over Family Dispute: భార్య కోసం తల్లిదండ్రులను చంపిన కొడుకు.. శవాలను ముక్కలుగా కోసి..

ABN , Publish Date - Dec 18 , 2025 | 01:20 PM

ఓ వ్యక్తి భార్యకు విడాకులు ఇవ్వటం కోసం డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో తల్లిదండ్రులను చంపేశాడు. శవాలను ముక్కలు చేసి నదిలో పడేశాడు. చివరకు పాపం పండి అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

Man Parents Over Family Dispute: భార్య కోసం తల్లిదండ్రులను చంపిన కొడుకు.. శవాలను ముక్కలుగా కోసి..
Man Parents Over Family Dispute

ఉత్తర ప్రదేశ్‌లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్య కోసం ఓ వ్యక్తి తన తల్లిదండ్రులను అతి కిరాతకంగా హత్య చేశాడు. శవాలను ముక్కలుగా కోసి నదిలో పడేశాడు. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. జౌన్‌పూర్‌కు చెందిన 62 ఏళ్ల శ్యామ్ బహదూర్, 60 ఏళ్ల బబిత భార్యాభర్తలు. వీరికి అంబేష్ అనే కొడుకు, కూతురు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం అంబేష్ ఓ ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. శ్యామ్, బబితలు ముస్లిం అమ్మాయిని కోడలిగా అంగీకరించలేకపోయారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇంటికి రానివ్వలేదు. ఈ విషయమై అంబేష్‌కు తల్లిదండ్రులతో గొడవలు జరుగుతూ వచ్చాయి.


భార్యకు విడాకులు ఇవ్వమని అంబేష్‌పై ఒత్తిడి తెస్తూ వచ్చారు. తల్లిదండ్రుల పోరు భరించలేక అంబేష్ భార్యకు విడాకులు ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. విడాకులు ఇవ్వాలంటే ఐదు లక్షల రూపాయల భరణం కావాలని భార్య అడిగింది. అతడి దగ్గర ఆమె అడిగినంత డబ్బులు లేవు. దీంతో విడాకుల కోసం డబ్బులు కావాలని తల్లిదండ్రులను అడిగాడు. డబ్బులు ఇవ్వడానికి వారు ఒప్పుకోలేదు. అంబేష్ కోపం కట్టలు తెంచుకుంది. డిసెంబర్ 8వ తేదీన రోకలి బండతో తల్లిదండ్రులను కొట్టి చంపేశాడు. వారి శవాలను ఆరు ముక్కలుగా కోసి పెద్ద సంచిలో వేశాడు. తర్వాత ఆ సంచుల్ని తీసుకెళ్లి దగ్గరలోని నదిలో పడేశాడు.


తర్వాత చెల్లెలికి ఫోన్ చేసి.. గొడవ కారణంగా తల్లిదండ్రులు ఇంట్లోనుంచి వెళ్లిపోయారని చెప్పాడు. తర్వాత తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయాడు. డిసెంబర్ 14వ తేదీన పని మీద సొంతూరికి వచ్చాడు. చెల్లెలితో పాటు స్థానికులు అతడ్ని తల్లిదండ్రుల గురించి నిలదీశారు. అతడినుంచి సరైన సమాధానం రాకపోవటంతో పోలీసులకు ఫోన్ చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అతడ్ని గట్టిగా విచారించారు. అసలు విషయం బయటపెట్టాడు. గొడవ కారణంగా తానే తల్లిదండ్రుల్ని చంపేసినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు నది నుంచి శవాలను స్వాధీనం చేసుకున్నారు. అంబేష్‌ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి

నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు.. పోలీసులు అలర్ట్..

ఆకుకూరలు వండేటప్పుడు ఈ పొరపాటు చేయకండి..

Updated Date - Dec 18 , 2025 | 01:26 PM