US Visa: హెచ్-1బీ పునరుద్ధరణలో మరింత జాప్యం
ABN , Publish Date - Feb 15 , 2025 | 05:11 AM
తాజా నిబంధన ప్రకారం గత 12 నెలల్లో గడువు తీరిన వీసాలను మాత్రమే ఇంటర్వ్యూ లేకుండా రెన్యువల్ చేసుకొనే అవకాశం ఉంటుంది.

డ్రాప్‌బాక్స్ అర్హత 12 నెలలకు కుదింపు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: అమెరికా వీసాలను రెన్యువల్ చేసుకోవాలనుకొనే భారతీయ దరఖాస్తుదారులకు సరికొత్త చిక్కులు ఎదురుకానున్నాయి. వీసా ఇంటర్వ్యూ మినహాయింపుల(డ్రా్‌పబాక్స్) అర్హతను అమెరికా విదేశాంగ శాఖ 48నెలల నుంచి ఒక్కసారిగా 12నెలలకు కుదించింది. తాజా నిబంధన ప్రకారం గత 12 నెలల్లో గడువు తీరిన వీసాలను మాత్రమే ఇంటర్వ్యూ లేకుండా రెన్యువల్ చేసుకొనే అవకాశం ఉంటుంది. తక్షణమే అమలులోకి రానున్న ఈ మార్పుతో హెచ్-1బీ, బీ1/ బీ2 తదితర నాన్‌ఇమిగ్రెంట్ వీసాదారులపై తీవ్ర ప్రభావం పడనుంది. దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ వీసా దరఖాస్తు కేంద్రాలు(వీఏసీ) ఇప్పటికే కొత్త నిబంధనలు అమలు చేయడం ప్రారంభించాయి. తాజా మార్పులతో భారత దరఖాస్తుదారులకు వీసా రెన్యువల్ మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ల కోసం దరఖాస్తుదారులు 400 రోజులకుపైగా నిరీక్షిస్తున్నారు. ఇప్పుడు వీసా గడువు తీరి ఏడాది దాటిన వారంతా మళ్లీ వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్న నిబంధనతో అమెరికా కాన్సులేట్లలో ఇంటర్వ్యూలకు డిమాండ్ పెరగడంతో పాటు వాటికోసం అభ్యర్థులు వేచి చూడాల్సిన సమయం కూడా పెరగనుంది.
ఇవి కూడా చదవండి...
PM Modi: ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం.. అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు
CEC: కొత్త సీఈసీ ఎంపికకు కసరత్తు.. 18న రాజీవ్ కుమార్ పదవీవిరమణ
Chennai: కమల్‌హాసన్‌తో ఉప ముఖ్యమంత్రి భేటీ..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.