Share News

India US Fight Against Terrorism: భారత్ కు ఫుల్ సపోర్ట్ ప్రకటించిన అమెరికా

ABN , Publish Date - May 01 , 2025 | 08:32 PM

భారత రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సేత్‌ ఇవాళ ఫోన్ చేశారు. పహల్గాం ఉగ్రవాద దాడిలో అమాయక పౌరులను చంపడంపై..

India US Fight Against Terrorism:  భారత్ కు ఫుల్ సపోర్ట్ ప్రకటించిన అమెరికా
India US Fight Against Terrorism

India US Fight Against Terrorism: భారత రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సేత్‌ ఇవాళ ఫోన్ చేశారు. జమ్మూ, కశ్మీర్‌ పహల్గాంలో అమాయక పౌరులను చంపడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భారత పౌరులకు జరిగిన నష్టానికి ఆయన తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అమెరికా భారతదేశంతో సంఘీభావంగా నిలుస్తుందని చెప్పారు. భారతదేశం తనను తాను రక్షించుకునే హక్కుకు అమెరికా ఎప్పుడూ మద్దతు ఇస్తుందని కార్యదర్శి హెగ్సేత్ అన్నారు. ఉగ్రవాదంపై భారతదేశం చేస్తున్న పోరాటంలో అమెరికా ప్రభుత్వం యొక్క సంపూర్ణ మద్దతును ఆయన పునరుద్ఘాటించారు.

ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్.. పాకిస్థాన్ ఎంతో కాలంగా చేస్తున్న అకృత్యాలని పీట్ హెగ్సేత్ కు వివరించారు. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం, శిక్షణ ఇవ్వడం, నిధులు సమకూర్చే చరిత్రను కలిగి ఉందని రాజ్ నాథ్ వివరించారు. ప్రపంచ సమాజం ఇలాంటి దారుణమైన ఉగ్రవాద చర్యలను స్పష్టంగా, నిస్సందేహంగా ఖండించడం పిలుపునివ్వడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు.


ఇవి కూడా చదవండి..

Raj Kasireddy: ఏపీ లిక్కర్ స్కాం.. రాజ్ కేసిరెడ్డికి ఎదురుదెబ్బ

Andhra Liquor Scam: లిక్కర్ స్కామ్.. ఎస్కేప్‌‌కు దిలీప్ యత్నం.. పట్టేసుకున్న సిట్

Chandrababu MSME Parks: రైతులను పారిశ్రామికవేత్తలను చేస్తాం.. పరిశ్రమలు పెట్టండి

Updated Date - May 01 , 2025 | 08:32 PM