PM Modi: ప్రధాని మోదీతో తులసి గబ్బార్డ్ భేటీ
ABN , Publish Date - Mar 18 , 2025 | 04:24 AM
ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మోదీ ఆమెకు ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా త్రివేణి సంగమ జలం ఇచ్చారు. ప్రతిగా ఆమె మోదీకి రుద్రాక్ష మాల బహూకరించారు. రెండు నెలల సమయంలో వీరిద్దరూ సమావేశం కావడం ఇది రెండోసారి. ఇటీవల మోదీ అమెరికాలో పర్యటించి నప్పుడు తులసితో సమావేశమయ్యారు.
ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీపై చర్చ.. తులసికి త్రివేణి సంగమ జలం ఇచ్చిన మోదీ
ప్రధానికి రుద్రాక్ష మాల బహూకరించిన గబ్బార్డ్
న్యూఢిల్లీ, మార్చి 17: భారత పర్యటనలో ఉన్న యూఎస్ ఇంటలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మోదీ ఆమెకు ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా త్రివేణి సంగమ జలం ఇచ్చారు. ప్రతిగా ఆమె మోదీకి రుద్రాక్ష మాల బహూకరించారు. రెండు నెలల సమయంలో వీరిద్దరూ సమావేశం కావడం ఇది రెండోసారి. ఇటీవల మోదీ అమెరికాలో పర్యటించి నప్పుడు తులసితో సమావేశమయ్యారు. అంతకు ముందు ఆమె రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమయ్యారు. భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న నిషేధిత ఖలిస్థానీ సంస్థ సిఖ్ ఫర్ జస్టి్‌సపై చర్యలు తీసుకోవాలని రాజ్‌నాథ్ ఆమెను కోరారు. రక్షణ రంగం, నిఘా సమాచార పంపిణీపై కూడా సమావేశంలో చర్చించారు. అంతకు ముందు ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తులసి గబ్బార్డ్ మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లో మైనార్టీల ఊచకోతపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు అమెరికా యత్నిస్తోందని చెప్పారు. క్లిష్ట సమయాల్లో తనకు భగవద్గీతలోని శ్రీకృష్ణుడి బోధనలు మార్గదర్శకంగా నిలిచాయని ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. 3 రోజుల ప ర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చిన ఆమె నిన్న భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన ప్రపంచ నిఘా విభాగాధిపతుల సదస్సులో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
Nishanth Dongari: ఇంధన నిల్వ విభాగంలో సరికొత్త ఉత్పత్తుల ఆవిష్కర్ణకు రంగం సిద్ధం
YSR Kadapa District: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు
PM Modi: మోదీ వ్యాఖ్యలపై స్పందించిన చైనా
CM Revanth Reddy: కేబినెట్ నుంచి మంత్రులను తొలగిస్తేనేనా..
Tirumala: శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్తున్నారా .. టేక్ కేర్
CM Revanth Reddy: అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Droupadi Murmu: రాష్ట్రపతి భవన్‌లో విందు.. హాజరైన ఏపీ ఎంపీలు
CM ChandraBabu: అందుకే ఈ డాక్యుమెంట్ రూపొందించాం
Raghurama serious: సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్