India: భారత్‌కు ఆత్మరక్షణ హక్కు
ABN , Publish Date - May 02 , 2025 | 04:36 AM
భారత్‌కు తాను రక్షించుకునే హక్కు ఉందని, ఉగ్రవాదంపై పోరులో అమెరికా సంపూర్ణ మద్దతు ఉంటుందని పీట్ హెగ్సేత్ ప్రకటించారు. పెహల్గాం ఉగ్రదాడి విషయమై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో కూడా భారత్‌కు మద్దతు వ్యక్తం చేశారు.
రాజ్‌నాథ్ సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడిన అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్
న్యూఢిల్లీ, మే 1: భారత్‌కు తనని తాను రక్షించుకునే హక్కు ఉందని, ఈ విషయంలో భారత్‌కు తమ మద్దతు ఉంటుందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ పేర్కొన్నారు. అలాగే, ఉగ్రవాదంపై చేసే పోరులోనూ భారత్‌కు తమ అండ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో గురువారం ఫోన్‌లో మాట్లాడిన పీట్.. పెహల్గాం ఉగ్రదాడి ఘటనపై విచారం వ్యక్తం చేశారు. పెహల్గాం ఘటనతో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి, పోషిస్తుందనే విషయం రుజువైందని రాజ్‌నాథ్ ఈ సందర్భంగా పీట్‌తో అన్నారు. ఈ మేరకు వారి మధ్య జరిగిన సంభాషణపై కేంద్ర రక్షణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. మరోపక్క, ఉగ్రవాదంపై చేసే పోరులో భారత్‌కు సహకరించేందుకు కట్టుబడి ఉన్నామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో అన్నారు. ఈ మేరకు రుబియో తనతో బుధవారం ఫోన్‌లో మాట్లాడారని, పెహల్గాం ఘటనపై విచారం వ్యక్తం చేశారని జైశంకర్ గురువారం ఎక్స్‌లో పోస్టు చేశారు. మరోవైపు.. పెహల్గాం దాడి నేపథ్యంలో భారత్ దౌత్యపరంగా వివిధ దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తాత్కాలిక సభ్య దేశాల్లో ఎనిమిదింటితో విదేశీ వ్యవహారాల శాఖ మాట్లాడింది. ఈ క్రమంలో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్.. దక్షిణ కొరియా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి చోటేయుల్‌తో గురువారం ఫోన్‌లో మాట్లాడారు.
ఇవి కూడా చదవండి
ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం
PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు
Read Latest AP News And Telugu News