Sale Of Javelin Missile System: అమెరికాతో కీలక ఒప్పందం.. ఇండియాకు జావెలిన్ మిస్సైల్ సిస్టమ్..
ABN , Publish Date - Nov 20 , 2025 | 09:20 AM
జావెలిన్ మిస్సైల్ సిస్టమ్‌తో పాటు సంబంధిత పరికరాలు అమ్మకానికి సంబంధించి అమెరికా, భారత్‌ల మధ్య ఒప్పందం జరిగింది. ఈ మేరకు డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
అగ్రరాజ్యం అమెరికాతో భారత్ కీలక ఒప్పందం చేసుకుంది. ఇండియాకు జావెలిన్ మిస్సైల్ సిస్టమ్‌తో పాటు సంబంధిత పరికరాలు అమ్మడానికి అమెరికా ఓకే చెప్పింది. ఇందుకోసం భారత్ ఏకంగా 4.7 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనుంది. ఈ మేరకు డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ (డీఎస్‌సీఏ)బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఒప్పందం ఇండియా, అమెరికాల మధ్య వ్యూహాత్మక బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొంది. ఒప్పందం ప్రకారం.. 100 ఎఫ్‌జీఎమ్ - 148 జావెలిన్ రౌండ్స్, ఒక జావెలిన్ ఎఫ్‌జీఎమ్ - 148 మిస్సైల్..
ఫ్లై టు బై, 25 జావెలిన్ లైట్ వెయిట్ కమాండ్ లాంచ్ యూనిట్స్, జావెలిన్ బ్లాక్ 1 కమాండ్ లాంచ్ యూనిట్స్ (సీఎల్‌యూ) అమ్మనుందని వెల్లడించింది. ఈ ప్యాకేజీలో నాన్ మేజర్ పరికరాలు.. జావెలిన్ ఎల్‌డబ్ల్యూ సీఎల్‌యూ లేదా సీఎల్‌యూ బేసిక్ స్కిల్స్ ట్రైనర్స్, మిస్సైల్ స్టిమ్యులేషన్ రౌండ్స్, బ్యాటరీ కూలంట్ యూనిట్, ఇంటరాక్టీవ్ ఎలక్ట్రానిక్ టెక్నికల్ మ్యానువల్, జావెలిన్ ఆపరేటర్ మ్యానువల్, లైఫ్ సైకిల్ సపోర్ట్, ఫిజికల్ సెక్యూరిటీ ఇన్సెక్షన్, స్పేర్ పార్ట్స్, సిస్టమ్ ఇంటిగ్రేషన్ అండ్ చెక్ అవుట్..
సెక్యూరిటీ అసిస్టెన్స్ మేనేజ్‌మెంట్ డైరెక్టరేట్ (ఎస్‌ఏఎమ్‌డీ) టెక్నికల్ అసిస్టెన్స్, టాక్టికల్ ఏవియేషన్ అండ్ గ్రౌండ్ మునిషన్ (టీఏజీఎమ్) ప్రాజెక్ట్ ఆఫీస్ టెక్నికల్ అసిస్టెన్స్, టూల్ కిట్స్, ట్రైనింగ్, బ్లాక్ 1 సీఎల్‌యూ రీఫబ్రిష్‌మెంట్ సర్వీసెస్, లాజిస్టిక్స్.. ప్రోగ్రామ్ సపోర్టు కూడా అమెరికా అందించనుంది. ఈ కొనుగోలు కారణంగా ప్రస్తుత, భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాలను భారత్ విజయవంతంగా ఎదుర్కోగలదని డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ స్పష్టం చేసింది. దేశ భద్రత మెరుగుపడుతుందని తెలిపింది.
ఇవి కూడా చదవండి
పైనాపిల్ ఈ వ్యక్తులకు విషంతో సమానం.!