Share News

Pineapple Health Risks: పైనాపిల్ ఈ వ్యక్తులకు విషంతో సమానం.!

ABN , Publish Date - Nov 20 , 2025 | 09:16 AM

పైనాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే, కొంత మందికి మాత్రం ఇది విషంతో సమానమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Pineapple Health Risks: పైనాపిల్ ఈ వ్యక్తులకు విషంతో సమానం.!
Pineapple Health Risks

ఇంటర్నెట్ డెస్క్: పైనాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ఎంజైమ్‌లు శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అయితే, కొంతమందికి ఈ పండు హానికరం కావచ్చు. పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్, బలమైన ఆమ్ల లక్షణాలు ఉంటాయి. ఇది కొంతమందికి అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి, ఎలాంటి సమస్యలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండటం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..


ఎవరెవరు పైనాపిల్ తినకూడదు?

  • పైనాపిల్ అలెర్జీలు ఉన్నవారు దీనిని తినడం వల్ల వికారం, వాంతులు, దురద వంటి లక్షణాలు వస్తాయి.

  • పైనాపిల్‌లో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు దీన్ని తినడం మంచిది కాదు.

  • పైనాపిల్ ఆమ్లత్వం ఎక్కువగా ఉండటం వల్ల, ఇది గుండెల్లో మంట లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.

  • పైనాపిల్‌లో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ కొందరిలో కడుపు నొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలకు కారణం కావచ్చు.

  • అలాగే, కీమోథెరపీ మందులు, కొన్ని యాంటిడిప్రెసెంట్స్ వంటి మందులు వాడుతున్నవారు పైనాపిల్ తినడం వల్ల మందుల ప్రభావం పెరిగే అవకాశం ఉంది.

  • అలాగే, దంత సమస్యలు ఉన్నవారు కూడా పైనాపిల్‌ తినడం మంచిది కాదు. ఎందుకంటే, దానిలోని ఆమ్లత్వం దంతాలకు హానికరం.


Also Read:

చలికాలంలో పొద్దున్నే అల్లం తింటే ఏం జరుగుతుందో తెలుసా?..

ఐ బొమ్మ రవి కేసులో సంచలన నిజాలు బయటపెట్టిన సీపీ సజ్జనార్

For More Latest News

Updated Date - Nov 20 , 2025 | 09:16 AM