Saif Ali Khan: సైఫ్‌కు క్షమాపణలు చెప్పిన బాలకృష్ణ హీరోయిన్ .. ఎందుకంటే..
ABN , Publish Date - Jan 18 , 2025 | 07:43 PM
బాలీవుడ్ నటుడు అలీఖాన్‌కు హీరోయిన్ ఊర్వశీ రౌతేలా క్షమాపణలు చెప్పింది. అయితే, ఊర్వశీ సైఫ్‌కు ఎందుకు క్షమాపణలు చెప్పింది? అసలేం జరిగింది? అని విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

Urvashi Rautela: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌కు డాకు మహారాజ్ హీరోయిన్ ఊర్వశీ రౌతేలా క్షమాపణలు చెప్పారు. నటుడు బాలకృష్ణకు జోడిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్న ఆమె సైఫ్ కు ఎందుకు క్షమాపణలు చెప్పారు? అసలేం జరిగింది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఓ దుండగుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించి విచక్షణ రహితంగా దాడికి పాల్పడాడ్డు. ఈ ఘటనలో ఆయన వెన్నుముకకు, మెడ, చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి. లీలావతి హాస్పటల్ లో వైద్యులు అతడికి సర్జరీలు చేసి సైఫ్ ప్రమాదం నుండి బయటపడ్డారు అని వెల్లడించారు. అయితే, ఆయనపై దాడి జరిగిన ఘటన అందరినీ కలిచి వేసింది. సినీ ప్రముఖులందరూ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
నన్ను క్షమించండి..
ఈ క్రమంలోనే ఓ ఇంటర్వూలో హీరోయిన్ ఊర్వశీ రౌతేలా.. సైఫ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానన్నారు. అయితే, అదే సమయంలో తనకు వచ్చిన బహుమతుల గురించి మాట్లాడారు. దీంతో సైఫ్ గురించి మాట్లాడిన సందర్భంలోనే తన వజ్రపు ఉంగరాన్ని చూపించి మాట్లాడడంపై నెటిజన్లు ఊర్వశీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఊర్వశీ రౌతేలాను తీవ్రంగా ట్రోల్ చేశారు. చివరికి సోషల్ మీడియాలో దుమారంతో ఆమె సైఫ్‌కు క్షమాపణలు చెప్పారు. సైఫ్ గురించి మాట్లాడిన సమయంలో తన ప్రవర్తనకు విచారం వ్యక్తం చేస్తున్నానంటూ ఇన్ స్టా పోస్ట్ చేశారు. సైఫ్‌పై దాడి తీవ్రత తెలిశాక తాను చాలా బాధపడినట్లు తెలిపారు. ఆ సమయంలో సైఫ్ చూపించిన ధైర్యం నిజంగా ప్రశంసనీయమని..ఆయనపై గౌరవం ఇంకా పెరిగిందని పేర్కొన్నారు.
అనుమానితుడు అరెస్టు
కాగా, సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో అనుమానితుడు తాజాగా అరెస్టు అయ్యాడు. ఛత్తీస్‌గడ్‌లో దుర్గ్ రైల్వే స్టేషన్‌లో రైల్వే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఛత్తీస్‌గడ్ వెళ్లిన ముంబై పోలీసులు..అనుమానితుడిని ముంబైకి తరలించనున్నారు.