Share News

UIDAI: పిల్లల ఆధార్‌ బయోమెట్రిక్స్‌ అప్‌డేట్‌ చేయండి

ABN , Publish Date - Aug 29 , 2025 | 03:07 AM

దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల ఆధార్‌ వేలిముద్రలను అప్‌డేట్‌ చేయాలని యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా...

UIDAI: పిల్లల ఆధార్‌ బయోమెట్రిక్స్‌ అప్‌డేట్‌ చేయండి

  • 5, 15 సంవత్సరాల వయస్సులో ఇది తప్పనిసరి

  • లేకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవు: ఉడాయ్‌ చీఫ్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 28: దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల ఆధార్‌ వేలిముద్రలను అప్‌డేట్‌ చేయాలని యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) విజ్ఞప్తి చేసింది. ఈమేరకు సంస్థ చీఫ్‌ భువనేశ్‌ కుమార్‌.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. పాఠశాలల్లో ప్రత్యేక క్యాంపులను నిర్వహించాలని ఆయన తన లేఖలో కోరారు. ఎదిగే పిల్లల బయోమెట్రిక్స్‌లో మార్పులు చోటుచేసుకుంటాయి. అందుకు అనుగుణంగా ఐదు నుంచి ఏడు సంవత్సరాల వయస్సులో, 15-17 సంవత్సరాల వయస్సులోనూ బయోమెట్రిక్స్‌ను అప్‌డేట్‌ చేయడం తప్పనిసరి(ఎంబీయూ). ఈ రెండు సందర్భాల్లోనూ ఈ సర్వీసు పూర్తి ఉచితం. ఆధార్‌ అప్‌డేట్‌ చేయకపోతే నీట్‌, జేఈఈ, సీయూఈటీ పరీక్షలకు హాజరయ్యే, ప్రభుత్వ పథకాలను అందుకునే విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందని ఉడాయ్‌ చీఫ్‌ హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి

బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు

యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..

Updated Date - Aug 29 , 2025 | 07:07 AM