కలికాలం.. ముగ్గురు పిల్లలను వదిలిపెట్టి.. ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి
ABN , Publish Date - Apr 10 , 2025 | 07:07 AM
ఇక్కడ మనం చెప్పుకోబోయే మహిళ మామూలు లేడీ కాదు. ఆమె గురించి పూర్తిగా తెలిస్తే.. కతర్నాక్ కిలేడీ అనుకోకుండా ఉండరు. ముగ్గురు పిల్లల తల్లైన ఈ మహిళ.. ముచ్చటగా మూడో సారి వివాహం చేసుకుంది.. అది కూడా ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని. ఆ వివరాలు..

లక్నో: మన చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు చూస్తే.. సమాజం ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి. మనిషిలో నేర ప్రవృత్తి పెరుగుతుంది. చిన్న చిన్న కారణాలకు కూడా దారుణ నిర్ణయాలు తీసుకుంటారు. హత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యాలయ్యాయి. ఇక నేటి కాలంలో ఆడవారిలో కూడా నేర ప్రవృత్తి పెరుగుతోంది. తమ సంతోషం కోసం చంపడానికి కూడా వెనకాడటం లేదు. పెళ్లి తర్వాత ప్రేమలు కూడా పెరుగుతున్నాయి. భర్తను కాదని మరో వ్యక్తిని ప్రేమించి.. వారి కోసం కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్లిపోతున్న వారి రోజు రోజుకు పెరుగుతుంది. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ముగ్గురు పిల్లలున్న ఓ మహిళ.. బిడ్డలను వదిలి ఇంటి ను ంచి వెళ్లిపోయి.. ఇంటర్ కుర్రాడిని వివాహం చేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఆ వివరాలు..
ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అమ్రోహ జిల్లాకు చెందిన షబ్నం అనే 26 ఏళ్ల మహిళకు వివాహం అయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అప్పటికే ఆమెకు రెండు వివాహాలు అయ్యాయి. ఈ క్రమంలో ఆమెకు పక్కింట్లో ఉండే ఇంటర్ సెకండియర్ చదివే విద్యార్థితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర బంధానికి దారి తీసింది. దాంతో షబ్నం తన రెండో భర్తకు విడాకులు ఇచ్చింది. ముగ్గురు పిల్లల బాధ్యతను కూడా అతడికే అప్పగించిన షబ్నం.. ముచ్చటగా మూడో సారి.. ఇంటర్ కుర్రాడిని వివాహం చేసుకుంది.
అయితే పెళ్లికి ముందే షబ్నం మతం మారి శివానీగా మారింది. ఇక వీరి పెళ్లి గురించి తెలిసి.. ఇరు కుటుంబాలు పంచాయతీకి కూడా పిలిచారు. అయితే షబ్నం మేజర్ కావడంతో.. ఆమెకు నచ్చినట్లు బతికే అవకాశం ఉందని.. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని పంచాయతీ పెద్దలు వెల్లడించారు. షబ్నం, ఆమెను వివాహం చేసుకున్న యువకుడు ఇద్దరు కూడా ఈ పెళ్లి తమకు ఇష్టమే అని స్పష్టం చేశారు. దాంతో చేసేదేంలేక ఇరువురి కుటుంబాలు వారి పెళ్లిని ఆమోదించాయి. ఇద్దరు సంతోషంగా ఉంటే చాలని చెప్పుకొచ్చారు.
షబ్నంకి తొలుత అలిగఢ్‌కు చెందిన వ్యక్తితో వివాహం అయ్యింది. కొన్నాళ్లకు వారిద్దరు డైవర్స్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు మరో పెళ్లి చేశారు తల్లిదండ్రులు. షబ్నం రెండోె పెళ్లి జరిగి ఎనిమిదేళ్లు అవుతుంది. అయితే ఏడాది క్రితం ఆమె భర్తకు యాక్సిడెంట్ అయ్యి.. వికలాంగుడిగా మారాడు. ఆ తర్వాతే.. షబ్నం, ఇంటర్ కుర్రాడిని ఇష్టపడటం, పెళ్లి చేసుకోవడం జరిగింది.
ఇవి కూడా చదవండి:
ప్రతీకార సుంకాల అమలు 90 రోజులు నిలుపుదల
Google Maps: గూగుల్ మ్యాప్స్ ఎంత పని చేసింది.. కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి..