Share News

Viral Affair Drama: భార్యకు ప్రియుడితో పెళ్లి చేసి.. అతడితో పంపించేసి..

ABN , Publish Date - Aug 10 , 2025 | 07:33 AM

Viral Affair Drama: ఓ రోజు మనోజ్ పని మీద వేరే ఊరు వెళ్లాడు. ఈ సమయంలో రూబీ తన ప్రియుడ్ని పిలిచింది. అయితే, మనోజ్ అనుకోని విధంగా ఇంటికి వెంటనే తిరిగి వచ్చాడు. ఇద్దరూ ఏకాంతంగా ఉన్నపుడు చూశాడు. అతడి కోపం కట్టలు తెంచుకుంది.

Viral Affair Drama: భార్యకు ప్రియుడితో పెళ్లి చేసి.. అతడితో పంపించేసి..
Viral Affair Drama

ఈ మధ్యకాలంలో పెళ్లి తర్వాత ప్రేమ వ్యవహారాలు ఎక్కువైపోయాయి. ఈ నేపథ్యంలోనే భర్తలు వినూత్న నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రేమ వ్యవహారాలు నడుపుతున్న భార్యలను ప్రియుళ్లకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. ఇందుకు ఏ మాత్రం ఆలోచించటం లేదు. ఉత్తర భారత దేశంలో ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. తాజాగా, కూడా ఓ సంఘటన వెలుగుచూసింది. ప్రియుడితో ఏకాంతంగా గడుపుతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన భార్యకు ఊహించని బహుమతి ఇచ్చాడు భర్త.


ఆమెను ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని షహనాజ్‌పూర్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రామ్‌నగర్ గ్రామానికి చెందిన మనోజ్‌, రూబీలకు 15 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఓ కొడుకు కూతురు ఉన్నారు. గత కొన్ని నెలలనుంచి రూబీ పొరుగు గ్రామానికి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం మనోజ్‌కు తెలిసింది. భార్యను మందలించాడు. కుటుంబం మీద ఫోకస్ చేయమని చెప్పాడు. కొన్ని రోజుల పాటు ఆమె మౌనంగా ఉంది.


ఓ రోజు మనోజ్ పని మీద వేరే ఊరు వెళ్లాడు. ఈ సమయంలో రూబీ తన ప్రియుడ్ని పిలిచింది. అయితే, మనోజ్ అనుకోని విధంగా ఇంటికి వెంటనే తిరిగి వచ్చాడు. ఇద్దరూ ఏకాంతంగా ఉన్నపుడు చూశాడు. అతడి కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే రూబీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి రమ్మన్నాడు. వాళ్లు రాగానే.. ‘మీ కూతుర్ని ఆమె ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేయండి. లేదంటే వారి వల్ల మనందరికీ ప్రమాదం తప్పదు’ అని అన్నాడు. మొదట వారు అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.


అతడు ఒప్పుకున్నాడు. అయితే, రూబీ మాత్రం భర్తతో ఉండటానికి ఒప్పుకోలేదు. దీంతో ఆమెకు ప్రియుడితో పెళ్లి చేశారు. పెళ్లికి ముందు రెండు కుటుంబాలు ఓ అగ్రిమెంట్ రాసుకున్నాయి. తనకు ఇకపై భార్యతో ఎటువంటి సంబంధం లేదని, ఆమె తన ప్రియుడితో సంతోషంగా ఉండొచ్చని భర్త ఆ అగ్రిమెంట్లో పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి

మరో ‘నక్షత్రం’ మెరిసింది..

గురుగ్రామ్ ల్యాండ్ డీల్‌లో రాబర్ట్ వాద్రాకు రూ.58 కోట్ల ముడుపులు.. కోర్టుకు తెలిపిన ఈడీ..

Updated Date - Aug 10 , 2025 | 07:44 AM