Share News

Newspaper Reading Mandatory: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై అది తప్పని సరి..

ABN , Publish Date - Dec 26 , 2025 | 04:12 PM

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ ఫోన్ వాడకాన్ని పిల్లలు తగ్గించే విధంగా అడుగులు వేస్తోంది. అన్ని సెకండరీ, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు వార్తా పత్రికలు చదవడాన్ని తప్పనిసరి చేసింది. ఈమేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది.

Newspaper Reading Mandatory: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై అది తప్పని సరి..
Newspaper Reading Mandatory

దాదాపు పదేళ్ల కాలంలో ప్రపంచం మొత్తం చాలా మారిపోయింది. టెక్నాలజీలో ఊహించని మార్పులు వచ్చాయి. మొబైల్ ఫోన్ వాడకం బాగా పెరిగిపోయింది. చిన్న పిల్లల దగ్గరినుంచి పండు ముసలి వారి వరకు మొబైల్ ఫోన్‌కు బానిస అవుతున్నారు. చిన్న పిల్లల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. గేమ్స్ , వీడియోస్ అంటూ గంటలు గంటలు ఫోన్ చూడ్డానికే పరిమితం అవుతున్నారు. మానసికంగా, శారీరకంగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. పుస్తకాల కంటే ఎక్కువగా స్మార్ట్ ఫోన్లే పిల్లల చేతుల్లో ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ ఫోన్ వాడకాన్ని పిల్లలు తగ్గించే విధంగా అడుగులు వేస్తోంది.


స్క్రీన్‌ టైమ్‌ తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం

విద్యార్థులకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని సెకండరీ, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు వార్తా పత్రికలు చదవడాన్ని తప్పనిసరి చేసింది. ఈమేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచేందుకు, డిజిటల్‌ స్క్రీన్‌ టైమ్‌ను తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల కోసం పాఠశాలల గ్రంథాలయాల్లో హిందీ, ఇంగ్లీష్‌ పేపర్లను అందుబాటులో ఉంచనున్నారు. ప్రతీ రోజూ విద్యార్థులు కొంత సమయం పాటు పేపర్లను తప్పని సరిగా చదవాల్సి ఉంటుంది.


ఈ మేరకు అడిషినల్ చీఫ్ సెక్రటరీ (బేసిక్ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్) పార్థ సార్థి సేన్ శర్మ డిసెంబర్ 23వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. అంతకు ముందు నవంబర్ నెలలో పిల్లల్లో పఠనాసక్తిని పెంచటం గురించి చర్చిస్తూ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇందుకు కొనసాగింపుగా తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉదయం అసెంబ్లీ సందర్బంగా పిల్లలు 10 నిమిషాల పాటు పేపర్ చదవాల్సి ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరు ఎడిటోరియల్ కాలమ్‌లోని మెయిన్ పాయింట్స్‌, జాతీయం, అంతర్జాతీయం, స్పోర్ట్స్‌లోని పాజిటివ్‌ న్యూస్‌ను చదువుతారు.


ఇవి కూడా చదవండి

లేడీ యూట్యూబర్‌పై రెచ్చిపోయిన యువకుడు.. ముద్దు కోసం ఏకంగా..

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని పరిణామం

Updated Date - Dec 26 , 2025 | 04:39 PM