New Delhi Station Stampede: తొక్కిసలాటలో కుట్ర కోణంపై దర్యాప్తు.. కేంద్ర మంత్రి
ABN , Publish Date - Feb 16 , 2025 | 09:37 PM
తప్పుడు సమాచారం వల్ల తొక్కిసలాట జరిగిందా అనే కోణం నుంచి కూడా రైల్వై శాఖ దర్యాప్తు జరుపుతోందని కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ చెప్పారు.
న్యూఢిల్లీ: రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగి 18 మంది ప్రయాణికులు మరణించిన ఘటన వెనుక కుట్ర కోణం ఉందా? దీనిపై కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తప్పుడు సమాచారం వల్ల తొక్కిసలాట జరిగిందా అనే కోణం నుంచి కూడా రైల్వై శాఖ దర్యాప్తు జరుపుతోందని చెప్పారు.
New Delhi Station Stampede: తొక్కిసలాట ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం.. కేంద్రంపై ఆప్ సంచలన ఆరోపణ
''ఇది ఎంతో విషాదకర ఘటన. రైల్వే శాఖ, ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తు్న్నాయి. ఈ ఘటన వెనుక కుట్ర కోణం కానీ, తప్పుడు సమాచార వ్యాప్తి కానీ జరిగిందా అనే దానిపై రైల్వే మంత్రిత్వ శాఖ దర్యాప్తు చేస్తోంది. రైల్వే మంత్రి పదవికి అశ్విని వైష్ణవ్ ఎంతో సమర్ధుడు'' అని మజుందార్ చెప్పారు.
ద్విసభ్య కమిటీ
న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట ఘటనపై దర్యాప్తునకు రైల్వే శాఖ అత్యున్నత స్థాయి ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో నార్తరన్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ (పీసీసీఎం) నార్సింగ్ డియో, ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ కమిషనర్ (పీసీఎస్‌సీ) పంకజ్ గాంగ్వార్ ఉన్నారు. తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున రైల్వే శాఖ పరిహారం ప్రకటించింది. తీవ్రంగ గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.1 లక్ష పరిహారం ఇస్తు్న్నట్టు తెలిపింది.
ఇవి కూడా చదవండి...
Maha Kumbh 2025: కుంభమేళాకు అర్థమే లేదు.. లాలూ వివాదాస్పద వ్యాఖ్యలు
Delhi Railway Station Stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు కారణం ఇదేనా?
Maharashtra: మహారాష్ట్రలో లవ్ జిహాద్ నియంత్రణకు చట్టం!
Ranveer Allahbadia: చంపుతామంటూ బెదిరిస్తున్నారు.. ఇన్‌స్టా పోస్ట్‌లో రణ్‌వీర్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.