Share News

258 Naxalites Surrendered: నక్సలిజంపై యుద్ధం.. అమిత్ షా సంచలన ప్రకటన..

ABN , Publish Date - Oct 16 , 2025 | 04:48 PM

గత రెండు రోజుల్లో ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలకు చెందిన 258 మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. దీనిపై కేంద్ర మంత్రి అమిత్ షా తన ఎక్స్ ఖాతాలో గురువారం ఓ పోస్టు పెట్టారు.

258 Naxalites Surrendered: నక్సలిజంపై యుద్ధం.. అమిత్ షా సంచలన ప్రకటన..
258 Naxalites Surrendered

కేంద్ర హోం మంత్రి అమిత్ షా 2026, మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని ప్రతిన బూనిన సంగతి తెలిసిందే. ఆ దిశగా గత కొన్ని నెలల నుంచి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. భద్రతా దళాలు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో విజృంభిస్తున్నాయి. నక్సల్స్‌ను ఏరిపారేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా మంది నక్సలైట్లు ప్రాణ భయంతో లొంగిపోతున్నారు.


మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న కీలక నేతలు సైతం లొంగిపోతున్నారు. గత రెండు రోజుల్లో ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలలో 258 మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. దీనిపై కేంద్ర మంత్రి అమిత్ షా తన ఎక్స్ ఖాతాలో గురువారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో .. ‘నక్సలిజానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఇది కీలకమైన రోజు. ఈ రోజు ఛత్తీస్‌గఢ్‌లో 170 మంది నక్సలైట్లు లొంగిపోయారు.


నిన్న 27 మంది లొంగిపోయారు. నిన్న మహారాష్ట్రలో 61 మంది నక్సలైట్లు లొంగిపోయారు. కేవలం రెండు రోజుల్లోనే 258 మంది నక్సలైట్లు హింసను వదిలిపెట్టేశారు. నేను వారి నిర్ణయాన్ని అభినందిస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషి కారణంగా నక్సలిజం అంతం అవ్వబోతోంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.


మా లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. ఎవరైనా లొంగిపోవాలని అనుకుంటే వారిని స్వాగతిస్తాము. లేదు గన్నులే పట్టుకుంటాము అంటే మా దళాల దమ్మును ఎదుర్కోండి. నేను మరో సారి విన్నవిస్తున్నా.. ఇప్పటికైనా నక్సలిజాన్ని వదిలేసేయండి. 2026, మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజం నిర్మూలనకు కట్టుబడి ఉన్నాము’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

క్యాన్సర్ గెలిచింది.. ఇదే నా చివరి ఏడాది.. యువకుడి ఎమోషనల్ పోస్ట్..

అవి పాకిస్థాన్ యుద్ధ ట్యాంకర్లేనా.. అఫ్గాన్ వీధుల్లో ర్యాలీ.. పాక్ మంత్రి ఏమన్నారంటే..

Updated Date - Oct 16 , 2025 | 05:13 PM