Share News

UGC-NET: రేపటి యూజీసీ-నెట్‌ పరీక్ష వాయిదా

ABN , Publish Date - Jan 14 , 2025 | 05:17 AM

సంక్రాంతి పండగ నేపథ్యంలో ఈ నెల 15 (బుధవారం)న జరగాల్సిన యూజీసీ-నెట్‌ పరీక్షను వాయిదా వేసినట్టు సోమవారం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది.

UGC-NET: రేపటి యూజీసీ-నెట్‌ పరీక్ష వాయిదా

  • 16వ తేదీ పరీక్షలు యథాతథం.. ఎన్‌టీఏ ప్రకటన

న్యూఢిల్లీ, జనవరి 13: సంక్రాంతి పండగ నేపథ్యంలో ఈ నెల 15 (బుధవారం)న జరగాల్సిన యూజీసీ-నెట్‌ పరీక్షను వాయిదా వేసినట్టు సోమవారం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ తరువాత ప్రకటిస్తామని తెలిపింది. 15న లా, జర్నలిజం-మాస్‌ కమ్యూనికేషన్‌ సహా 17 సబ్జెక్టుల్లో పరీక్షలు జరగాల్సి ఉండగా అవన్నీ వాయిదా పడ్డాయని ఎన్‌టీఏ డైరెక్టర్‌ (పరీక్షలు) రాజేష్‌ కుమార్‌ తెలిపారు.


16వ తేదీన జరగాల్సిన పరీక్షలన్నీ యథావిధిగా కొనసాగుతాయని, అందులో మార్పు లేదని ప్రకటించారు. పీహెచ్‌డీ ప్రోగ్రాంలు, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషి్‌పలు పొందడం, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు అర్హత సాఽధించడం కోసం ఈ పరీక్షలు జరుగుతున్నాయి.

Updated Date - Jan 14 , 2025 | 05:17 AM