Share News

Gang Rape Case: పశ్చిమబెంగాల్‌ గ్యాంగ్‌రేప్‌ కేసులో మరో ఇద్దరు అదుపులోకి

ABN , Publish Date - Oct 14 , 2025 | 04:49 AM

పశ్చిమబెంగాల్‌లో వైద్య విద్యార్థిని గ్యాంగ్‌రేప్‌ కేసులో సోమవారం మరో ఇద్దరిని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు.

Gang Rape Case: పశ్చిమబెంగాల్‌ గ్యాంగ్‌రేప్‌ కేసులో   మరో ఇద్దరు అదుపులోకి

కోల్‌కతా, అక్టోబరు 13: పశ్చిమబెంగాల్‌లో వైద్య విద్యార్థిని గ్యాంగ్‌రేప్‌ కేసులో సోమవారం మరో ఇద్దరిని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టయిన వారి సంఖ్య ఐదుకు చేరింది. పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వైద్య విద్యార్థిని అర్ధరాత్రి 12.30 గంటలకు బయటకు ఎందుకు వెళ్లిందని ప్రశ్నించారు. అయితే ఆ వ్యాఖ్యలకు భిన్నంగా ఆ రాష్ట్ర పోలీసులు ఈ ఘటన శుక్రవారం రాత్రి 8-8.45 గంటల మధ్యే జరిగిందని నిర్ధారించారు. కాగా బాధితురాలి వెంట బయటకు వెళ్లిన ఆమె స్నేహితుణ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లో రాజకీయ వాతావరణాన్ని వేడిక్కెంచింది. ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి ఈ కేసులో సాక్ష్యాధారాలను నాశనం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

Updated Date - Oct 14 , 2025 | 04:49 AM