Share News

Indian Tourists Jailed: వేశ్యలపై దాడి, దోపిడి.. ఇద్దరు భారతీయులకు జైలు శిక్ష

ABN , Publish Date - Oct 04 , 2025 | 06:55 PM

భారత్‌కు చెందిన 23 ఏళ్ల ఆరోక్యసామి డైసన్, 27 ఏళ్ల రాజేంద్రన్ మాయిలరసన్ గత ఏప్రిల్ 24వ తేదీన సింగపూర్‌కు వెకేషన్‌కు వెళ్లారు. రెండు రోజుల తర్వాత లిటిల్ ఇండియా ఏరియాలో నడుచుకుంటూ వెళుతున్నారు.

Indian Tourists Jailed: వేశ్యలపై దాడి, దోపిడి.. ఇద్దరు భారతీయులకు జైలు శిక్ష
Indian Tourists Jailed

ఇంటర్నెట్ డెస్క్: హాలీడే ట్రిప్‌ కోసం సింగపూర్ వెళ్లిన ఇద్దరు భారతీయులు క్రిమినల్ కేసులో చిక్కుకున్నారు. హోటల్ గదుల్లో ఇద్దరు వేశ్యలపై దాడి చేయటంతోపాటు వారి వద్ద నుంచి వస్తువుల్ని దొంగిలించారన్న ఆరోపణలతో సింగపూర్ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. శుక్రవారం విచారణ జరిపిన కోర్టు వారికి శిక్షలు ఖరారు చేసింది. ఇద్దరికీ చెరో 5 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతోపాటు 12 చెరకు గడ దెబ్బలు కూడా విధించింది.


వివరాల్లోకి వెళితే.. భారత్‌కు చెందిన 23 ఏళ్ల ఆరోక్యసామి డైసన్, 27 ఏళ్ల రాజేంద్రన్ మాయిలరసన్ గత ఏప్రిల్ 24వ తేదీన సింగపూర్‌కు వెకేషన్‌కు వెళ్లారు. రెండు రోజుల తర్వాత లిటిల్ ఇండియా ఏరియాలో నడుచుకుంటూ వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి వారి దగ్గరకు వచ్చి వేశ్యల గురించి చెప్పాడు. ఓ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్లిపోయాడు. అయితే, ఆ ఇద్దరికీ డబ్బులు అవసరం ఉండటంతో క్రిమినల్ ఐడియా వేశారు.


అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఓ వేశ్యను హోటల్ గదిలో కలిశారు. గదిలోకి వచ్చిన వెంటనే వారు ఆమె కాళ్లు, చేతులు కట్టేశారు. ఆమెను కొట్టి నగలు, డబ్బు, పాస్‌పోర్టు, బ్యాంక్ కార్డులు దోచుకున్నారు. తర్వాత కట్లు విప్పేసి బయటకు వెళ్లిపోయారు. అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో మరో వేశ్యతోనూ ఇలానే చేశారు. రెండో వేశ్య ఈ విషయాన్ని తనకు తెలిసిన వ్యక్తికి చెప్పింది. అతడు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వమని చెప్పాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఇద్దరూ అరెస్ట్ అయ్యారు. శుక్రవారం ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పు వెలువడింది. కోర్టు వారికి 5 ఏళ్ల జైలు శిక్షతోపాటు 12 చెరకు గడ దెబ్బలు విధించింది.


ఇవి కూడా చదవండి

అన్నదాన కార్యక్రమంలో విషాదం.. చిన్నారుల మీద పడ్డ గంజి

హ్యాపీగా ఉండాలంటే షారుఖ్ చెప్పిన సీక్రెట్ ఫాలో అవ్వాల్సిందే..

Updated Date - Oct 04 , 2025 | 08:07 PM