SRK Happiness Formula: హ్యాపీగా ఉండాలంటే షారుఖ్ చెప్పిన సీక్రెట్ ఫాలో అవ్వాల్సిందే..
ABN , Publish Date - Oct 04 , 2025 | 05:01 PM
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కూడా జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. వాటి నుంచి ఎన్నో నేర్చుకున్నారు. జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో షారుఖ్ తన అభిమానులకు చెప్పారు.
సినిమా స్టార్ల జీవితం అంటే పూల పాన్పు అనుకుంటూ ఉంటారు చాలా మంది. సినిమా వాళ్ల తళుకుబెళుకుల జీవితాలను చూసి ‘వీళ్లకేం.. నేము, ఫేము, మనీ.. అన్నీ ఉన్నాయ్.. అదృష్టవంతులు’ అనుకుంటూ ఉంటారు. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్లు సినిమా వాళ్ల జీవితాల్లో కేవలం సుఖాలు మాత్రమే ఉంటాయి అనుకుంటే పొరపాటే. సాధారణ వ్యక్తుల లాగే వాళ్లు కూడా సంతోషం కోసం కంటికి కనిపించని శత్రువుతో బయటకు కనిపించే యుద్ధం చేయాల్సి ఉంటుంది.
ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న తర్వాతే సంతోషం ఎక్కడ ఉందో.. ఎలా దాన్ని కాపాడుకోగలమో అర్థం అవుతుంది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కూడా జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. వాటి నుంచి ఎన్నో నేర్చుకున్నారు. జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో షారుఖ్ తన అభిమానులకు చెప్పారు. ఆయన ఏమన్నారంటే.. ‘నాకో ఫ్రెండ్ ఉన్నాడు. అతడో పెద్ద డైరెక్టర్, ప్రొడ్యూసర్. అతడి పేరు చెప్పను.
'ఓ రోజు అతడు నన్ను పిలిచాడు. ‘నీ సినిమా విడుదలైతే.. నా సినిమా నాశనం అవుతుంది’ అన్నాడు. ‘ఏం కావాలి నీకు’ అని అడిగాను. ‘నీ సినిమా ఇప్పుడు రిలీజ్ చేయవద్దు’ అన్నాడు. నేను సరేనన్నాను. నువ్వు ఎందుకంత అప్‌సెట్‌గా ఉన్నావు’ అని అడిగాను. అప్పుడు అతడు ‘నువ్వు నన్ను అసహ్యించుకుంటూ ఉంటావు కదూ’ అని అన్నాడు. అందుకు నేను ‘నీ గురించి నేను మంచిగా కానీ, చెడుగా కానీ అనుకోను. నీ గురించి అస్సలు ఆలోచించను. నేను 99.99 శాతం మంది గురించి ఆలోచించను. నేను నా ఫ్యామిలీ గురించి, నా ఫ్రెండ్స్ గురించి మాత్రమే ఆలోచిస్తాను' అని చెప్పినట్లు తెలిపాడు. అందరూ తనలాగే చేస్తే జీవితంలో సంతోషంగా ఉంటారని షారుఖ్ తన ఫ్యాన్స్ కు సీక్రెట్ రివీల్ చేశాడు.
ఇవి కూడా చదవండి
జీవితంలో విజయం సాధించడానికి పాటించాల్సిన నియమాలు ఇవే.!
సముద్రంలో బయటపడ్డ 300 ఏళ్ల నాటి సంపద.. విలువ ఎన్ని కోట్లంటే..