18th Century Shipwreck: సముద్రంలో బయటపడ్డ 300 ఏళ్ల నాటి సంపద.. విలువ ఎన్ని కోట్లంటే..
ABN , Publish Date - Oct 04 , 2025 | 03:04 PM
సముద్రంలో 300 ఏళ్ల పాటు ఉన్నా నాణేలపై అక్షరాలు మాత్రం ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ఆ నాణేలు మెక్సికో, పెరు, బొలీవియా దేశాలలో ముద్రించబడ్డాయి.
సముద్రంలో పురాతన కాలం నాటి భారీ సంపద బయటపడింది. పెద్ద సంఖ్యలో వెండి నాణేలు, బంగారు వస్తువులు చిక్కాయి. ఆ సంపద 300 ఏళ్ల క్రితం ఫ్లోరిడాలోని ట్రెజర్ కోస్టులో మునిగిపోయిన ఓ ఓడకు చెందినదిగా తెలుస్తోంది. ఆ ఓడ 1715లో అట్లాంటిక్ మహా సముద్రంలో స్పెయిన్ వెళుతూ ఉంది. ఓడలో విలువైన సంపద చాలా ఉంది. వెండి, బంగారం పెద్దపెద్ద పెట్టెల నిండా ఉంది.
భారీ సంపదతో వెళుతున్న ఆ ఓడ 1715, జులై 31వ తేదీన ఫ్లోరిడాలోని ట్రెజర్ కోస్టుకు చేరుకుంది. అక్కడ తుఫాను కారణంగా సముద్రంలో మునిగిపోయింది. ఓడ మునిగి 300 ఏళ్లు అవుతున్నా అందులోని సంపద జాడ ఎవ్వరికీ తెలియలేదు. కొన్నిరోజుల క్రితం కొంత మంది నిధుల వేటగాళ్లు సముద్రంలో వెతుకులాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఓ పెట్టె నిండా వెండి నాణేలు, బంగారు వస్తువులు చిక్కాయి.
వాటి విలువ 1 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే అక్షరాలా రూ.8 కోట్ల పైనే. సముద్రంలో 300 ఏళ్ల పాటు ఉన్నా నాణేలపై అక్షరాలు మాత్రం ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ఆ నాణేలు మెక్సికో, పెరు, బొలీవియా దేశాలలో ముద్రించబడ్డాయి. ప్రస్తుతం ఈ సంపదకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి
భార్య ఈ విషయాలను తన భర్త నుండి ఎప్పుడూ దాచకూడదు
హమాస్ శాంతి ఒప్పందానికి సిద్ధమన్న ట్రంప్.. ఇంతలో మళ్లీ ఇజ్రాయెల్ దాడులు