Donald Trump: మోదీతో మంచి సంబంధాలున్నాయ్
ABN , Publish Date - Sep 19 , 2025 | 06:19 AM
భారత ప్రధాని నరేంద్ర మోదీతో తనకు స్నేహ సంబంధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు...
నేను ఇండియాకు చాలా దగ్గర: ట్రంప్
వాషింగ్టన్, సెప్టెంబరు 18: భారత ప్రధాని నరేంద్ర మోదీతో తనకు స్నేహ సంబంధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. బుధవారం మోదీకి ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పగా, గురువారం సామాజిక మాధ్యమాల్లో మరో పోస్టు పెట్టారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పినందుకు ట్రంప్‌నకు కృతజ్ఞతలు చెబుతూ మోదీ పోస్టు పెట్టారు. దానిపై స్పందించిన ట్రంప్... వాషింగ్టన్, ఢిల్లీల మధ్య చాలా మంచి సంబంధాలు ఉన్నాయని, మోదీతో తనకు వ్యక్తిగత సాన్నిహిత్యం ఉందని తెలిపారు. ‘‘నేను ఇండియాకు చాలా దగ్గర. భారత ప్రధాన మంత్రికి కూడా చాలా దగ్గర. నిన్నే ఆయనతో మాట్లాడా. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పా. మా మధ్య చాలా మంచి సంబంధాలు ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. రెండు దేశాల మఽధ్య వాణిజ్యపర ఘర్షణలు నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి