Share News

ట్రంప్‌తో పాక్‌ ఆర్మీ చీఫ్‌ లంచ్‌ భేటీ

ABN , Publish Date - Jun 19 , 2025 | 04:38 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ అసిమ్‌ మునీర్‌ ‘మధ్యాహ్న భోజన’ సమావేశం

ట్రంప్‌తో పాక్‌ ఆర్మీ చీఫ్‌ లంచ్‌ భేటీ

భారత్‌కు భారీ ఎదురుదెబ్బ

అఖిలపక్ష భేటీకి కాంగ్రెస్‌ డిమాండ్‌

న్యూఢిల్లీ, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ అసిమ్‌ మునీర్‌ ‘మధ్యాహ్న భోజన’ సమావేశం కావడం భారత్‌ దౌత్య వ్యూహానికి పెద్ద ఎదురుదెబ్బ అని కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. తన మూడు దేశాల పర్యటన విశేషాలతోపాటు ట్రంప్‌తో ఫోన్‌లో ఏం మాట్లాడారో ప్రధాని మోదీ జాతికి చెప్పాలన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌.. దీనిపై తక్షణం అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కశ్మీర్‌ విషయంలో తృతీయపక్షం జోక్యాన్ని అనుమతించబోమని ట్రంప్‌తో ఫోన్‌ సంభాషణల్లో ప్రధాని మోదీ చెప్పారన్న విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్త్రీ ప్రకటనపై జైరాం ప్రతిస్పందించారు. భ్రమలకంటే వాస్తవాలపైనే మోదీ సర్కార్‌ తప్పనిసరి దౌత్యవ్యూహం అమలు చేయాలని ఆయన సూచించారు.

Updated Date - Jun 19 , 2025 | 08:05 AM