Trump India Remarks: మోదీ మిత్రుడేకానీ
ABN , Publish Date - Sep 07 , 2025 | 06:29 AM
పెనం మీద అట్టు తిరగేసినంత సులువుగా మాట మార్చడంలో ట్రంప్ నేర్పరి అని మరోసారి రుజువైంది. ‘‘భారత్‌ను, రష్యాను చీకటి చైనాకు కోల్పోయాం.. ఆ మూడు దేశాలూ చిరకాలం...
ప్రస్తుతం ఆయన చేస్తున్న పనే నాకు నచ్చట్లేదు
ఇరు దేశాల మధ్య ప్రత్యేక బంధం ఉంది
విభేదాలున్నా ఆందోళన చెందక్కర్లేదు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త రాగం
న్యూయార్క్/వాషింగ్టన్/న్యూఢిల్లీ, సెప్టెంబరు 6: పెనం మీద అట్టు తిరగేసినంత సులువుగా మాట మార్చడంలో ట్రంప్ నేర్పరి అని మరోసారి రుజువైంది. ‘‘భారత్‌ను, రష్యాను చీకటి చైనాకు కోల్పోయాం.. ఆ మూడు దేశాలూ చిరకాలం సుసంపన్నంగా వర్ధిల్లాలి’’ అంటూ వ్యంగ్యం ఒలకబోసిన 24 గంటల్లోనే.. ట్రంప్ స్వరం మార్చారు. తాను ఎప్పటికీ మోదీకి స్నేహితుడుగా ఉంటానని.. భారత్, అమెరికా మధ్య ప్రత్యేక సంబంధాలు ఉన్నాయని కొత్త రాగం అందుకున్నారు. వైట్‌హౌ్‌సలోని తన కార్యాలయమైన ఓవల్ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన.. భారత్-అమెరికా సంబంధాలను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నారా? అని అడిగిన ప్రశ్నకు ఇలా స్పందించారు. ‘‘నేనెప్పటికీ మోదీకి మిత్రుడిగా ఉంటాను. ఆయనో గొప్ప ప్రధాని. చాలా గొప్పవాడు. ఆయనతో స్నేహంగా ఉంటాను. కాకపోతే.. ప్రస్తుతం ఆయన చేస్తున్న పనే నాకు నచ్చట్లేదు. కానీ, భారత్-అమెరికా మధ్య ప్రత్యేక బంధం ఉంది. (రెండు దేశాల సంబంధాల గురించి) ఆందోళన చెందాల్సిన పని లేదు. కొన్నిసార్లు చిన్న చిన్న విభేదాలు వస్తాయి అంతే’’ అని నవ్వుతూ చెప్పారు. రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనుగోలు చేయడం తనను నిరాశకు గురి చేసిందన్నారు. ‘‘అందుకే భారత్‌పై భారీగా 50ు సుంకాలు విధించాం. అది చాలా ఎక్కువ టారిఫ్. అయినా నేను ప్రధాని మోదీతో బాగా కలిసిపోతాను. ఆయన చాలా గొప్పవారు’’ అని వ్యాఖ్యానించారు. భారత్‌తో, ఇతర దేశాలతో వాణిజ్య చర్చలు ఎలా జరుగుతున్నాయనే మరో ప్రశ్నకు.. భారత్‌తోపాటు చాలా దేశాలతో చర్చలు బాగా జరుగుతున్నాయని చెప్పారు. కానీ.. గూగుల్‌తో సహా పలు ఇతర పెద్ద కంపెనీలో విషయంలో యూరోపియన్ యూనియన్‌లో జరుగుతున్న దాని పట్ల తాము అసంతృప్తిగా ఉన్నామని ట్రంప్ బదులిచ్చారు. గూగుల్ వ్యాపార విధానాలు చట్టవిరుద్ధమని పేర్కొంటూ ఈయూ ఇటీవలికాలంలో రూ.వేల కోట్ల జరిమానాలు విధించిన సంగతి తెలిసిందే. అలాగే.. పన్ను ఎగవేత కేసులో యాపిల్‌పైన, వినియోగదారుల డేటా రక్షణ విషయంలో ఫేస్‌బుక్(మెటా)పైన, మార్కెట్లో సొంత ఉత్పత్తులకు మాత్రమే ప్రోత్సాహం ఇచ్చిందంటూ అమెజాన్‌పైన, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను విండో్‌సతో కలిపి అమ్మినందుకు మైక్రోసా్‌ఫ్టపైన ఈయూ జరిమానాలు విధించింది. ఈ క్రమంలోనే ట్రంప్ ఈయూపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సానుకూల భాగస్వామ్యం..
ఇండియా-అమెరికా మధ్య ప్రత్యేక బంధం ఉందని.. చిన్నచిన్న విభేదాలున్నా అవి సర్దుకుంటాయన్న ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ అంతే సానుకూలంగా స్పందించారు. ట్రంప్ అభిప్రాయాలను తాను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని.. తాను కూడా అదే భావాలతో స్పందిస్తున్నానని మోదీ పేర్కొన్నారు. ‘‘ఇండియా, అమెరికా మధ్య అత్యంత సానుకూలమైన, ముందుచూపుతో కూడిన సమగ్ర అంతర్జాతీయ స్థాయి వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది’’ అని మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. మోదీ, ట్రంప్ చివరిసారిగా ఈ ఏడాది జూన్ 17న ఫోన్‌లో మాట్లాడుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వారిద్దరూ బహిరంగ వేదికపై తమ అభిప్రాయాలు పంచుకోవడం ఇదే మొదటిసారి.
ఇవి కూడా చదవండి..
తిహాడ్ జైలును పరిశీలించిన యూకే అధికారులు.. నీరవ్ మోదీ, మాల్యాను అప్పగించే అవకాశం
అన్నాడీఎంకేలో ముదిరిన విభేదాలు.. సెంగోట్టియన్‌ను పార్టీ పదవుల నుంచి తొలగించిన ఈపీఎస్
For More National News And Telugu News