Breast Milk Donation: తల్లిపాల దానంలో తిరుచ్చి మహిళ రికార్డు
ABN , Publish Date - Aug 07 , 2025 | 06:11 AM
తమిళనాడులోని తిరుచ్చి నగరం సమీప కాట్టూరుకు చెందిన సెల్వబృంద
చెన్నై, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని తిరుచ్చి నగరం సమీప కాట్టూరుకు చెందిన సెల్వబృంద (34) అనే గృహిణి 300 లీటర్ల దాకా తల్లిపాలను దానం చేసి తన అమ్మ మనసు చాటుకుంది. తద్వారా ఆమె అరుదైన రికార్డ్ సాధించింది. ఇద్దరు పిల్లలకు తల్లిగా ఉన్న ఆ మహిళ తిరుచ్చిలోని మహాత్మాగాంధీ స్మారక ప్రభుత్వ ఆస్పత్రిలోని తల్లిపాల బ్యాంక్‌కు 2023 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి దాకా అంటే 22 నెలల వ్యవధిలో 300.17 లీటర్ల రొమ్ముపాలను దానం చేసింది. ఆమె చేసిన పాలదానం వల్ల బరువుతక్కువగా జన్మించిన పసికందులు, రొమ్ముపాలు కొరతగా ఉన్న బాలింతలకు జన్మించిన పసికందులకు ప్రాణదానం చేసినట్లయింది. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని ఆ తల్లిపాల బ్యాంక్ అధికారులు ఈ వివరాలను బుధవారం వెల్లడించారు. సెల్వ బృంద చేసిన తల్లిపాల దానం ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్సు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సాధించింది.