Share News

Goa stampede: గోవా ఆలయంలో తొక్కిసలాట

ABN , Publish Date - May 04 , 2025 | 05:24 AM

గోవా శిర్గావ్‌లోని శ్రీలైరాయ్‌ ఆలయంలో జాతర సందర్భంగా జరిగిన తొక్కిసిలాటలో ఆరుగురు మరణించగా, 80 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ విచారణ చేపట్టమని గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ ఆదేశించారు.

Goa stampede: గోవా ఆలయంలో తొక్కిసలాట

ఆరుగురి మృతి, ఐదుగురి పరిస్థితి విషమం

పనాజీ, మే 3: ఉత్తర గోవాలోని శిర్గావ్‌లో ఉన్న శ్రీలైరాయ్‌ ఆలయంలో జాతర సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున భక్తులు నిప్పుల గుండంలో నడిచే సమయంలో తొక్కిసిలాట చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా.. ఆరుగురు మృతిచెందారు. మరో 80 మంది గాయాలపాలయ్యారు. వీరిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని గోవా ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజీత్‌రాణె వెల్లడించారు. తీవ్ర గాయాలపాలైన వారిని గోవా వైద్య కళాశాల(జీఎంసీ)లో చేర్పించినట్లు డీజీపీ అలోక్‌ కుమార్‌ తెలిపారు. ఏటా మే నెలలో శ్రీలైరాయ్‌ దేవీ జాతర జరుగుతుంది. ఈ ఉత్సవాలకు గోవాతోపాటు.. మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో హాజరవుతారు. శుక్రవారం సాయంత్రం జాతర మొదలవ్వగా.. భక్తులు క్రమంగా శిర్గావ్‌ చేరుకోవడం ప్రారంభించారు. తెల్లవారుజామున 3గంటలకు జరిగే అగ్నిగుండం వేడుక సమయానికి ఆ ప్రాంతంలో 40వేల మంది వరకు భక్తులున్నట్లు పోలీసులు తెలిపారు. ‘‘అగ్నిగుండం సమీపంలో ఓ వైపు ఉన్న ఏటవాలుగా ప్రాంతంలో ఎక్కువ మంది నిలబడ్డారు. భక్తులు అగ్నిగుండంలో నడుస్తున్న సమయంలో.. అటువైపు రద్దీ పెరిగింది. ఈ క్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారు. గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌కు ఫోన్‌ చేశారు. సీఎం సావంత్‌ ఉదయమే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు.


ఇవి కూడా చదవండి

Vastu Tips: ఇంట్లో బంగారాన్ని ఇక్కడ అస్సలు పెట్టకండి

IPL 2025: ఏఐ అద్భుతం.. ఇండియన్ ప్రీమియర్ లడ్డూ లీగ్..

Updated Date - May 04 , 2025 | 05:24 AM