Share News

Traffic Jam : భారీగా నిలిచిపోయిన వాహనాలు

ABN , Publish Date - Jan 30 , 2025 | 03:51 AM

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న మహాకుంభమేళాకు భక్తులు భారీగా తరలి వస్తుండటంతో ఉత్తరప్రదేశ్‌-మధ్యప్రదేశ్‌ సరిహద్దుల్లో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో నిలిచిపోయిన

Traffic Jam : భారీగా నిలిచిపోయిన వాహనాలు

లక్నో, జనవరి 29: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న మహాకుంభమేళాకు భక్తులు భారీగా తరలి వస్తుండటంతో ఉత్తరప్రదేశ్‌-మధ్యప్రదేశ్‌ సరిహద్దుల్లో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో నిలిచిపోయిన ఈ వాహనాల్లో అనేక మంది భక్తులు చిక్కుకుపోయారు. దీంతో వీరికి ఆహారం, వసతి ఏర్పాట్లు చేసినట్లు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ ఎక్స్‌ ద్వారా వెల్లడించారు. డాక్టర్ల బృందాన్ని కూడా అందుబాటులో ఉంచామన్నారు. భక్తులు ఓపికగా ఉంటూ అధికార యంత్రాంగానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మహాకుంభమేళాకు వస్తున్న భక్తులు ఆ తర్వాత కాశీకి ఎక్కువగా వెళ్తుండటంతో తీవ్రమైన రద్దీ నెలకొంది. కాశీ విశ్వనాథ్‌ మందిర్‌కు దారి తీసే మార్గాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఫిబ్రవరి 5న వసంత పంచమికి కూడా భక్తులు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశముందని భావిస్తున్నారు.


మరో 3 వారాలు అయోధ్యకు రాకండి

మహాకుంభమేళా కోసం ప్రయాగ్‌రాజ్‌ వస్తున్న భక్తులు సమీపంలోనే ఉన్న అయోధ్యకు తరలివెళ్తుండటంతో రామజన్మభూమి ఆలయ నిర్వాహక కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మరో మూడు వారాల పాటు అయోధ్యలో రాముడి దర్శనం కోసం రావద్దని భక్తులకు సూచించింది. రద్దీ తగ్గాక ప్రశాంతంగా వచ్చి రామ్‌లల్లా దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అయోధ్య పర్యటన వాయిదా వేసుకోవాలని సూచించింది.


ఇవి కూడా చదవండి..

Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ

Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్‌షా 3 సవాళ్లు

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 30 , 2025 | 03:51 AM