Toll Fee: ఈ రూల్స్ తెలుసా.. వీరు టోల్ ఫీజు కట్టనక్కర్లేదు..
ABN , Publish Date - Apr 04 , 2025 | 06:15 PM
Toll Fee Rules: వాహనం టోల్ గేట్ దాటాలంటే ట్యాక్స్ కట్టాల్సిందే. వాహనాన్ని బట్టి ట్యాక్స్ రుసుము ఉంటుంది. అయితే, ప్రభుత్వ వర్గాలు, ప్రముఖులతో పాటు.. కొందరు సామాన్యులకు కూడా ఈ టోల్ చెల్లింపులో మినహాయింపు ఉంటుందని మీకు తెలుసా.. ఆ నిబంధనలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

Toll Tax Rules: భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ అనేక టోల్ ప్లాజాలు ఉన్నాయి. ప్రస్తుత లెక్కల ప్రచారం దేశ వ్యాప్తంగా సుమారు 1063 టోల్ ప్లాజాలు ఉన్నాయి. వీటి సంఖ్య కూడా నానాటికి పెరుగుతోంది. గత 5 సంవత్సరాల్లో 400 లకు పైగా కొత్త టోల్ ప్లాజాలు ఏర్పాటయ్యాయి. త్రీ వీలర్ నుంచి భారీ వాహనాల వరకు రోడ్డుపై నడపాలంటే టోల్‌గేట్ వద్ద ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ టోల్ చెల్లిస్తేనే టోల్ గేట్ దాటేందుకు అనుమతిస్తారు. అయితే, గతంలో మాన్యువల్‌గా టోల్ ఛార్జీలు చెల్లించేవారు. కానీ, ఇప్పుడు అంతా ఆన్‌లైన్ సిస్టమ్ అయ్యింది. ఫాస్టాగ్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫాస్టాగ్ సహాయంతో క్షణాల్లో చెల్లింపులు జరిగిపోతున్నాయి. అయితే, ఫాస్టాగ్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం.. కొన్ని నిబంధనలు కూడా పెట్టింది. అందులో 10 సెకన్ల నియమం చాలా కీలకమైంది.
ఈ నియమం ద్వారా ఎలాంటి టోల్ ఫీజు చెల్లించకుండానే టోల్ గేట్ దాటే అవకాశం ఉంటుంది. మరి ఈ నియమం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రతిరోజూ లక్షలాది వాహనాలు టోల్ ప్లాజాల గుండా వెళ్తుంటాయి. వీటి కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అనేక నియమనిబంధనలు రూపొందించి. ఈ నియమాల్లో ఒకటి 10 సెకన్ల రూల్. దీని ప్రకారం.. టోల్ ప్లాజా వద్ద ఒక వాహనం నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు నిలిచి ఉన్నట్లయితే.. అలాంటి వాహనానికి టోల్ ఛార్జ్ వర్తించదు. వారు టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు. రద్దీ సమయాల్లోనూ ఈ నియమం వర్తిస్తుందని ఎన్‌హెచ్ఏఐ స్పష్టం చేసింది. ఈ రూల్‌ని ఎన్‌హెచ్ఏఐ 2021లో తీసుకువచ్చింది.
వీరు కూడా టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు..
టోల్ ట్యాక్స్ పేమెంట్ విషయంలో మరో రూల్ కూడా ఉంది. అది కూడా సామాన్యులకు ఉపయుక్తంగా ఉంటుంది. ఎన్‌హెచ్ఏఐ నిబంధనల ప్రకారం.. టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల దూరంలోని వాహనాలకు ఈ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. స్థానిక ప్రజలు తమ వాహనాలపై నిరంతరం వెళ్లాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనను రూపొందించారు. అయితే, కమర్షియల్ వాహనాలకు మాత్రం ఈ అవకాశం లేదు. స్థానికులై ఉండి.. టోల్ ట్యాక్స్ మినహాయింపు కావాలంటే.. లోకల్ రెసిడెంట్ పాస్ గానీ, నెలవారీ పాస్ గానీ తీసుకోవాలి. అలాగే లోకల్ ప్రూఫ్ ఉండాలి. లేదంటే రెట్టింపు ఫైన్ కట్టాల్సి వస్తుంది.
Also Read:
ట్రంప్ సుంకాల దెబ్బ.. అమెరికా సంపన్నులకు షాక్
పోటీలో లేను.. అన్నామలై కీలక వ్యాఖ్యలు
జాక్ పాట్ కొట్టిన కజకిస్తాన్ దేశం.. మరికొన్ని రోజుల్లో..
For More National News and Telugu News..