Share News

Minister: తమిళ మాధ్యమంలోనే వైద్య విద్య

ABN , Publish Date - Apr 19 , 2025 | 12:12 PM

ఇకనుంచి తమిళ మాధ్యమంలో వైద్యవిద్యా కోర్సులుండే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆరోగ్య శాఖామంత్రి ఎం.సుబ్రమణ్యం పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తమిళ మీడియంలో ఎంబీబీఎస్‌ పాఠ్యాంశాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నదే సీఎం స్టాలిన్‌ నేతృత్వంలోని ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

 Minister: తమిళ మాధ్యమంలోనే వైద్య విద్య

- మంత్రి సుబ్రమణ్యం

చెన్నై: త్వరలోనే తమిళ మాధ్యమంలో వైద్యవిద్యా కోర్సులుండే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆరోగ్య శాఖామంత్రి ఎం.సుబ్రమణ్యం(M Subramanyam) పేర్కొన్నారు. సైదాపేట సడయప్పన్‌వీధిలో కొత్తగా నిర్మించిన ఓ ప్రైవేటు ఆస్పత్రిని ప్రారంభించిన సందర్భంగా మంత్రి సుబ్రమణ్యం మీడియాతో మాట్లాడారు. ఎగ్మోర్‌లోని ప్రభుత్వ ప్రసూతి కేంద్రంలో ఇటీవల ప్రారంభించిన సంతాన సాఫల్య కేంద్రానికి ప్రజాదరణ పెరుగుతోందని, మదురై, సేలం, కోవై ప్రాంతాల్లో కూడా వీటిని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ వార్దను కూడా చదవండి: BJP: తేల్చి చెప్పేశారుగా.. అధికారంలో భాగస్వామ్యం కోరం..


తమిళ మీడియంలో ఎంబీబీఎస్‌ పాఠ్యాంశాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నదే సీఎం స్టాలిన్‌(CM Stalin) నేతృత్వంలోని ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. మూడేళ్ళ క్రితమే వైద్యవిద్యకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను తమిళంలో తర్జుమా చేసే ప్రక్రియను తమిళనాడు టెస్ట్‌బుక్స్‌ సొసైటీ పూర్తిచేసిందని తెలిపారు. ఈ పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలల్లో 7.5శాతం రిజర్వేషన్‌ కోటాలో చదువుకుని ఎంబీబీఎస్‌ ఫస్ట్‌ ఇయర్‌లో చేరిన విద్యార్ధులకు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.


వైద్య విద్యార్ధులు ఐదేళ్ళ పాటు తమిళ మాధ్యమంలో చదవడంలో పలు సమస్యలున్నాయని, వాటిని సడలించడంపై ఆలోచించి నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి వివరించారు. ముదల్వర్‌ మెడికల్‌ షాపుల్లో మందులకు కొరత ఏర్పడినట్లు మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమ న్నారు. రాష్ట్రంలో మరో ఆరు వైద్యవిద్యా కళాశాలలను కొత్తగా ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరుతూ కేంద్రప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు.


రాష్ట్రంలోవున్న అన్ని వైద్యవిద్యా కళాశాలల్లో ప్రిన్సిపాళ్లు పనిచేస్తున్నారని, రాయపురం స్టాన్లీ వైద్య కళాశాలలో మాత్రమే ప్రిన్సిపాల్‌ పోస్టు భర్తీ చేయలేదన్నారు. అయినప్పటికీ మెడికోల సంక్షేమార్ధం తాత్కాలిక ప్రిన్సిపాల్‌ను నియమించినట్లు తెలిపారు. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ నిర్వహణలో వున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీ అయిన వైద్యులు, నర్సుల పోస్టుల భర్తీకి మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖామంత్రి కేఎన్‌ నెహ్రూ చర్యలు చేపట్టారన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

బస్తర్‌లో కాల్పుల విరమణ అత్యవసరం

ఆర్‌ఎస్‌ఎస్ తరహాలో.. ప్రజల్ని కలవండి

గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను రద్దు చేయండి

మాటల్లో కాదు చేతల్లో చూపండి

కీర్తి సురేష్ క్యూట్‏గా...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 19 , 2025 | 12:12 PM