Bangalore: ధరలేక పొలంలోనే వదిలేశారుగా..
ABN , Publish Date - Feb 02 , 2025 | 01:59 PM
అన్ని కూరల్లో వినియోగించే కొత్తిమీరకు ప్రస్తుతం ధర లేకపోవడంతో నష్టపోతున్నట్టు పలువురు రైతులు వాపోయారు. ఒక ఎకరా కొత్తిమీర పండించాలంటే 40వేల రూపాయలు ఖర్చు అవుతుందని, నాలుగు నెలలుగా కొత్తిమీర కట్ట కేవలం రూపాయి మాత్రమే పలుకుతుండడంతో నష్టపోతున్నామని పాలూరుకు చెందిన రైతు రంగనాథ్ విచారం వ్యక్తం చేశారు.
బెంగళూరు: అన్ని కూరల్లో వినియోగించే కొత్తిమీరకు ప్రస్తుతం ధర లేకపోవడంతో నష్టపోతున్నట్టు పలువురు రైతులు వాపోయారు. ఒక ఎకరా కొత్తిమీర పండించాలంటే 40వేల రూపాయలు ఖర్చు అవుతుందని, నాలుగు నెలలుగా కొత్తిమీర కట్ట కేవలం రూపాయి మాత్రమే పలుకుతుండడంతో నష్టపోతున్నామని పాలూరుకు చెందిన రైతు రంగనాథ్ విచారం వ్యక్తం చేశారు. ఇదివరకు 45రోజులకు కోతకు వచ్చేదని, ప్రస్తుతం హైబ్రీడ్ రకం 30రోజులకే వస్తోందన్నారు. దీంతో పలువురు రైతులు కొత్తిమీర సాగువైపు ఆసక్తి చూపడంతో డిమాండ్ తగ్గిందన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Young doctor: రోడ్డు ప్రమాదంలో యువ డాక్టర్ మృతి

ఇదివరకు కొత్తమీరను సమీపం లోని తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ(Tamil Nadu, Andhra, Telangana) రాష్ట్ర ప్రాంతాలకు ఎగుమతి చేసే వారమని ఐదారు నెలలుగా డిమాండ్ లేకపోవడంతో దూర ప్రాంతాలకు ఎగుమతి సాధ్యం కావడం లేదన్నారు. కోలారు(Kolar) జిల్లాలో 10వేలకుపైగా ఎకరాలలో పండిస్తుండడంతో ధర తగ్గిందని మరో రైతు అభిప్రాయ పడ్డారు. ఈ తరుణంలో గిట్టుబాటు ధర లేకపోవడంతో కొత్తిమీర పంట ను పశువులకు ఆహారంలా వదిలేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Financial Survey: పన్ను వసూళ్లలో తెలంగాణ నం.1
ఈవార్తను కూడా చదవండి: ప్రయాగ్‌రాజ్‌లో నలుగురు మహిళల అదృశ్యం!
ఈవార్తను కూడా చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు.. కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్‌రెడ్డి
ఈవార్తను కూడా చదవండి: ఏకంగా సచివాలయంలో నకిలీ ఉద్యోగులు హల్‌చల్
Read Latest Telangana News and National News