Share News

Azharuddin: అజారుద్దీన్ ఇంట్లో చోరీ.. టీవీ సెట్, రూ.50 వేల నగదు మాయం..

ABN , Publish Date - Jul 19 , 2025 | 11:56 AM

అజారుద్దీన్ మాజీ భార్య సంగీత బిజిలానీ పేరిట మహారాష్ట్రలోని లోనావాలాలో ఓ బంగ్లా ఉంది. ఈ బంగ్లాలో గత కొద్ది కాలంగా ఎవరూ ఉండడం లేదు. తాజాగా ఆ ఇంటిని తెరిచి చూడగా చాలా వస్తువులు ధ్వంసమైనట్టు కనిపించాయి. ఈ ఏడాది మార్చి 7 నుంచి జూలై 18 మధ్యలోనే ఈ దొంగతనం జరిగింది.

Azharuddin: అజారుద్దీన్ ఇంట్లో చోరీ.. టీవీ సెట్, రూ.50 వేల నగదు మాయం..
Azharuddin

టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ (Azharuddin) ఇంట్లో చోరీ జరిగింది. అజారుద్దీన్ మాజీ భార్య సంగీత బిజిలానీ పేరిట మహారాష్ట్రలోని లోనావాలాలో ఓ బంగ్లా ఉంది. ఈ బంగ్లాలో గత కొద్ది కాలంగా ఎవరూ ఉండడం లేదు. తాజాగా ఆ ఇంటిని తెరిచి చూడగా చాలా వస్తువులు ధ్వంసమైనట్టు కనిపించాయి. ఈ ఏడాది మార్చి 7 నుంచి జూలై 18 మధ్యలోనే ఈ దొంగతనం జరిగింది. దీంతో బంగ్లా సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు (Theft in Azharuddins house).


పోలీసుల కథనం ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు బంగ్లా వెనుక కాంపౌండ్ గోడ వైర్ మెష్‌ను తెంచుకుని లోపలికి చొరబడ్డారు. మొదటి అంతస్తు పైకి ఎక్కి, కిటికీ గ్రిల్‌ను బలవంతంగా తెరిచి బంగ్లాలోకి ప్రవేశించారు. లోపల ఉన్న రూ.50,000 నగదును, రూ.7,000 విలువైన టెలివిజన్ సెట్‌ను దొంగిలించారు. అలాగే ఇంటిలోని పలు వస్తువులను కూడా నిందితులు ధ్వంసం చేశారు. నిందితులు ఉద్దేశపూర్వకంగానే ఈ విధ్వంసానికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు.


అజారుద్దీన్ వ్యక్తిగత సహాయకుడు మహ్మద్ ముజీబ్ ఖాన్ ఈ చోరీ గురించి పుణె రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. అలాగే ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో ఆధారాలను సేకరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

గోదావరిపై మీ కార్యాచరణ ఏంటి?

Read Latest Telangana News and National News

Updated Date - Jul 19 , 2025 | 02:04 PM