Pahalgam attack: పహల్గాం ఉగ్రదాడి పాక్-చైనాల ఉమ్మడి కుట్ర
ABN , Publish Date - May 05 , 2025 | 04:15 AM
పహల్గాం దాడి పాక్-చైనా కుట్రగా మాజి ఆర్మీ అధికారి అదిల్ రాజా వ్యాఖ్యానించారు. భారత్ వైపు కంపెనీలు తరలిపోవడం ఆపేందుకు ఈ దాడిని ప్రణాళికతో నిర్వహించారని చెప్పారు.
బహుళజాతి కంపెనీలు చైనా నుంచి
భారత్‌కు తరలిపోకుండా అడ్డుకునేందుకే దాడి
యుద్ధం మొదలైతే భారత్‌కు కంపెనీలు పోవని యోచన
పాక్ రిటైర్డ్ ఆర్మీ మేజర్ అదిల్ రజా సంచలన ఆరోపణ
ఇస్లామాబాద్, మే 4: పహల్గాం ఉగ్రదాడి పాక్-చైనాల ఉమ్మడి కుట్ర అని పాక్ రిటైర్డ్ ఆర్మీ అధికారి మేజర్ అదిల్ రజా ఆరోపించారు. చైనా నుంచి కంపెనీలు భారత్‌కు తరలిపోకుండా అడ్డుకునేందుకే ఈ దాడి జరిపించాయన్నారు. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం వల్ల కంపెనీలు చైనాను వీడి భారత్‌కు పోతుండటమే దాడికి ప్రధాన కారణంగా ఆయన చెప్పారు. అతిపెద్ద తయారీ దారు దేశంగా ఉన్న పేరు ప్రతిష్టలు దెబ్బతింటుండటంతో కలవరపడిన చైనా.. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌తో కలిసి ఈ దాడికి కుట్ర పన్నిందని అదిల్ రజా వెల్లడించారు. పాక్‌తో యుద్ధానికి దిగితే భారత్‌లో కల్లోలం ఏర్పడి కంపెనీలు తరలింపు యోచన విరమించుకుంటాయనేది చైనా యోచన అన్నారు.
ఇవి కూడా చదవండి
Pehalgam Terror Attack: ప్రధాని మోదీతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భేటీ..
India Vs Pakistan: భారత్ సైనిక సమాచారం పాక్‌కు చేరవేత.. ఇద్దరి అరెస్ట్
Rahul Gandhi: సిక్కుల ఊచకోతపై రాహుల్ గాంధీ స్పందన
For National News And Telugu News