Colombo airport: కొలంబో ఎయిర్‌పోర్టులో హైటెన్షన్
ABN , Publish Date - May 04 , 2025 | 04:39 AM
పహల్గాం దాడి చేసిన ఉగ్రవాదులు శ్రీలంక విమానంలో పారిపోయే అవకాశం ఉందన్న భారత నిఘా సమాచారం నేపథ్యంలో కొలంబో ఎయిర్‌పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. చెన్నై నుంచి వచ్చిన యూఎల్122 విమానాన్ని తనిఖీ చేసినప్పటికీ ఉగ్రవాదుల జాడ కనిపించలేదు.
న్యూఢిల్లీ, మే 3: పహల్గాం దాడి జరిపిన ఉగ్రవాదులు శ్రీలంక ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో పారిపోతున్నారన్న సమాచారంతో కొలంబో ఎయిర్‌పోర్టులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ సమాచారం భారత్‌నుంచి రావడంతో శ్రీలంక ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుంది. చెన్నై నుంచి కొలంబోకు బయలుదేరిన ఈ విమానంలో ఆరుగురు ఉగ్రవాదులు ప్రయాణిస్తున్నట్టు భారత నిఘావర్గాలు అనుమానించాయి. వెంటనే శ్రీలంకను అప్రమత్తం చేశాయి. దీంతో కొలంబోలోని బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం మధ్యాహ్నం 11.59 నిమిషాలకు విమానం(యూఎల్122) ఆగిన వెంటనే అందులో తనిఖీలు జరిపారు. అయితే, విమానంలో ఉగ్రవాదుల జాడ కనిపించలేదు.
ఇవి కూడా చదవండి
Vastu Tips: ఇంట్లో బంగారాన్ని ఇక్కడ అస్సలు పెట్టకండి
IPL 2025: ఏఐ అద్భుతం.. ఇండియన్ ప్రీమియర్ లడ్డూ లీగ్..