Share News

YouTuber Jyoti Malhotra: పాకిస్థాన్‌ గుడిలో ఘంటసాల పాట

ABN , Publish Date - May 20 , 2025 | 05:04 AM

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌లోని కటార్సరాజ్ ఆలయాన్ని సందర్శించి, అక్కడ ఘంటసాల పాట వినిపించడాన్ని తన వీడియోలో చూపించారు. ఆ వీడియో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌గా మారింది.

YouTuber Jyoti Malhotra: పాకిస్థాన్‌ గుడిలో ఘంటసాల పాట

హైదరాబాద్‌, మే 19: వేరే రాష్ట్రాలకు వెళ్లినప్పుడు అక్కడ మనకు తెలుగు మాట వింటేనే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది! అలాంటిది.. వేరే దేశంలో.. అందునా పాకిస్థాన్‌లో తెలుగు మాట కాదు.. గాన గంధర్వుడు మన ఘంటసాల పాడిన సూపర్‌హిట్‌ పాట ఒకరి నోట వినిపిస్తే? గూఢచర్యం ఆరోపణలపై ఇటీవల అరెస్టయిన యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా వీడియోలో అలాంటి అద్భుతమే కనిపించింది. రెండు నెలల క్రితం ఆమె పాకిస్థాన్‌లోని ‘కటా్‌సరాజ్‌’ ఆలయానికి వెళ్లి.. ఆ గుడి ప్రాశస్త్యాన్ని వివరించే వీడియోను తన యూట్యూబ్‌ చానల్‌లో పోస్ట్‌ చేసింది. ఆ వీడియోలో 6.50 నిమిషాల వద్ద.. ఆమె ఆ ప్రాంగణంలోని ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుంటుండగా ‘భూకైలా్‌స’లోని ‘రాముని అవతారం రవికుల సోముని అవతారం’ అనే పాట వినిపిస్తుంది. లోపల ఒక పెద్దాయన కూర్చుని భక్తిగా ఆ పాట పాడుతున్న దృశ్యం కనిపిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌ అవుతోంది.


ఇవీ చదవండి:

Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్

భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 20 , 2025 | 05:04 AM