Share News

బిహార్‌లో 15 శాతం మంది ఓటర్లను తొలగించే ముప్పు

ABN , Publish Date - Jul 20 , 2025 | 06:19 AM

ఎన్నికల కమిషన్‌ బిహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కారణంగా 15ు మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించే ముప్పు ఉందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌...

బిహార్‌లో 15 శాతం మంది ఓటర్లను తొలగించే ముప్పు
RJD, Rahul Gandhi, opposition unity,

  • తేజస్వీ యాదవ్‌ ఆరోపణ.. 35 మంది నేతలకు లేఖలు

పట్నా, జూలై 19: ఎన్నికల కమిషన్‌ బిహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కారణంగా 15ు మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించే ముప్పు ఉందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ శనివారం రాహుల్‌ గాంధీ సహా దేశంలోని 35 మంది సీనియర్‌ ప్రతిపక్ష నాయకులకు లేఖలు రాశారు. బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి మేరకు జరుగుతున్న ఈ ప్రత్యేక సవరణ ప్రజల ఓటింగ్‌ హక్కులు, ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి అని పేర్కొన్నారు. ఇది పారదర్శకంగా, సమ్మిళితంగా ఉండేలా పోరాటం కొనసాగిస్తానని తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

తాడిపత్రిలో టెన్షన్‌ టెన్షన్‌

ప్రభుత్వ బడుల్లో నో వేకెన్సీ పరిస్థితి తేవాలి

Read latest AP News And Telugu News

Updated Date - Jul 20 , 2025 | 06:19 AM