Share News

Tejas Fighter: తేజస్‌ యుద్ధ విమానాల తయారీలో ముందడుగు

ABN , Publish Date - Jul 16 , 2025 | 05:15 AM

తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ ఎంకే-1ఏ ఉత్పత్తిలో కీలక ముందుడుగు పడింది. తేజస్‌ తయారీలో కీలకమైన ఎఫ్‌-404 ఇంజన్ల డెలివరీ మళ్లీ మొదలైంది....

Tejas Fighter: తేజస్‌ యుద్ధ విమానాల తయారీలో ముందడుగు

బెంగళూరు, జూలై 15: తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ ఎంకే-1ఏ ఉత్పత్తిలో కీలక ముందుడుగు పడింది. తేజస్‌ తయారీలో కీలకమైన ఎఫ్‌-404 ఇంజన్ల డెలివరీ మళ్లీ మొదలైంది. ఈ యుద్ధ విమానాలను తయారు చేస్తున్న హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌)కు అమెరికాకు చెందిన జనరల్‌ ఎలక్ట్రిక్‌ (జీఈ) సంస్థ సుదీర్ఘ విరామం తర్వాత రెండో ఇంజన్‌ను అందించింది. జీఈ నుంచి వచ్చే ఏడాది మార్చిలోగా 12 ఇంజన్లను డెలివరీ తీసుకోవాలని హాల్‌ భావిస్తోంది. మొత్తం 99 ఇంజన్ల కోసం భారత్‌ 2021లో జీఈతో ఒప్పందం చేసుకుంది. అయితే.. వరుస అవాంతరాల కారణంగా ఇంజన్ల డెలివరీ ఆలస్యమవుతూ వస్తోంది. ఇప్పుడు డెలివరీ ప్రారంభం కావడంతో ఈ ఏడాది చివరిలోగా మరో పది ఇంజన్లు భారత్‌కు రావొచ్చని భావిస్తున్నారు. భారత వైమానిక దళం తమకు 83 తేజస్‌ ఎంకే-1ఏ యుద్ధ విమానాలు కావాలని హాల్‌కు ఆర్డర్‌ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి:

ఇక సమోసా, జిలేబీలకూ సిగరెట్ ప్యాకెట్ తరహా హెచ్చరికలు..

మహారాష్ట్రలో మరో కలకలం.. హిందీలోనే మాట్లాడతానన్న ఆటో డ్రైవర్‌పై దాడి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 16 , 2025 | 05:15 AM