Share News

హైదరాబాద్‌ వచ్చే విమానంలో సాంకేతిక లోపం

ABN , Publish Date - Jun 30 , 2025 | 04:10 AM

సాంకేతిక లోపం కారణంగా హైదరాబాద్‌కు వెళ్లాల్సిన ఓ విమానం తిరిగి చెన్నైలో దిగింది. నెల్లూరుకు సమీపంలో గాల్లో ఉండగా విమానంలో సాంకేతిక లోపాన్ని...

హైదరాబాద్‌ వచ్చే విమానంలో సాంకేతిక లోపం

చెన్నై, న్యూఢిల్లీ, జూన్‌ 29: సాంకేతిక లోపం కారణంగా హైదరాబాద్‌కు వెళ్లాల్సిన ఓ విమానం తిరిగి చెన్నైలో దిగింది. నెల్లూరుకు సమీపంలో గాల్లో ఉండగా విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించారు. వెంటనే పైలట్‌ అధికారులను సంప్రదించిన తర్వాత చెన్నైలో విమానాన్ని సురక్షితంగా దింపినట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విమానంలో 159 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఇదిలా ఉండగా.. టోక్యో నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్‌ ఇండియా విమానాన్ని ఆదివారం కోల్‌కతాకు మళ్లించారు. క్యాబిన్‌లో అధిక ఉష్ణోగ్రత మూలంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Also Read:

యువ రచయిత సూరాడ ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు..

నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే...

For More Telugu News

Updated Date - Jun 30 , 2025 | 04:10 AM