Sivakasi Incident: తమిళనాడు శివకాశీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి..
ABN , Publish Date - Jul 01 , 2025 | 02:40 PM
తమిళనాడులోని శివకాశి సమీపంలోని ఒక ప్రైవేట్ బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 5 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు.
తమిళనాడు: తమిళనాడు రాష్ట్రం విరుదునగర్ జిల్లాలోని శివకాశిలోని బాణసంచా తయారీ కర్మాగారంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీ నుండి పెద్ద శబ్దం, పొగలు రావడంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, రెస్క్యూ సర్వీసెస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా 5 మంది కార్మికులు మరణించినట్లు తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఫ్యాక్టరీ మొత్తం ధ్వంసమైందని, పలువురు గాయపడ్డారని, ప్రస్తుతం శిథిలాలను తొలగించే పని జరుగుతోందని అగ్నిమాపక, రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం , బాణసంచా తయారీ కర్మాగారంలో రసాయనాలను కలిపే పని జరుగుతుండగా పేలుడు సంభవించింది. రసాయనాలను కలిపే సమయంలో ఘర్షణ కారణంగా మంటలు చెలరేగి, ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిందని భావిస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు ప్రారంభించినా, అప్పటికి చాలా నష్టం జరిగిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేప్పట్టారు.
Also Read:
పాశమైలారం ప్రమాద మృతుల కుటుంబాలకు కోటి నష్టపరిహారం: సీఎం రేవంత్ రెడ్డి
ఆలయాల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం
For More Telangana News