Share News

Supreme Court: అటవీ విస్తీర్ణం తగ్గించే ఎలాంటి చర్యలూ చేపట్టొద్దు

ABN , Publish Date - Feb 05 , 2025 | 05:07 AM

ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో అటవీ భూమిని వేరే అవసరాలకు మళ్లిస్తే వెంటనే ప్రత్యామ్నాయంగా మరో చోట అడవిని పెంచాలని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన వన సంరక్షణ, సంవర్ధన నిబంధనలు-2023 కారణంగా 1.97 లక్షల చ.కి.మీ.

Supreme Court: అటవీ విస్తీర్ణం తగ్గించే ఎలాంటి చర్యలూ చేపట్టొద్దు

ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: అడవుల విస్తీర్ణాన్ని తగ్గించే ఎలాంటి చర్యలూ చేపట్టకూడదని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో అటవీ భూమిని వేరే అవసరాలకు మళ్లిస్తే వెంటనే ప్రత్యామ్నాయంగా మరో చోట అడవిని పెంచాలని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన వన సంరక్షణ, సంవర్ధన నిబంధనలు-2023 కారణంగా 1.97 లక్షల చ.కి.మీ. భూమిని ‘అడవుల’ నిర్వచనం పరిధి నుంచి తప్పించారంటూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన దర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. విశ్రాంత ఇండియన్‌ ఫారెస్టు సర్వీసు అధికారులు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ‘అడవి’కి ఉన్న నిర్వచనాన్ని మార్చి ఇతర అవసరాల కోసం భూమిని కేటాయిస్తున్నారని ఆ పిటిషన్‌లో ఆరోపించారు.


మరిన్ని వార్తల కోసం..

PM Modi: ఎవర్నీ వదిలిపెట్టలేదు.. ఆటాడుకున్న పీఎం

Maha Kumbh Mela 2025: కుంభమేళాకు ప్రధాని మోదీ.. పవిత్ర స్నానంతోపాటు ప్రత్యేక పూజలు

Delhi Elections: ఎన్నికలకు సిద్ధం.. 35,000 మంది పోలీసులు, సీసీ టీవీ నిఘా..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 05 , 2025 | 05:09 AM