Share News

Supreme Court: రాష్ట్రపతి సందేహాలపై 22న సుప్రీం విచారణ

ABN , Publish Date - Jul 20 , 2025 | 06:34 AM

అసెంబ్లీలు తీర్మానించిన బిల్లులను నిర్ణీత వ్యవధిలో ఆమోదించాలంటూ కోర్టులు రాష్ట్రపతికి గడువు విధించగలవా? అన్న సందేహాలపై సుప్రీంకోర్టు ఈ నెల 22న విచారణ జరపనుంది...

Supreme Court: రాష్ట్రపతి సందేహాలపై 22న సుప్రీం విచారణ

  • బిల్లుల ఆమోదంపై కోర్టులు గడువు విధించవచ్చా?

  • రాష్ట్రపతి సంధించిన 14 ప్రశ్నలపై విచారణ

  • బిల్లుల ఆమోదానికి గడువు అంశంలో

  • రాష్ట్రపతి సందేహాలపై

  • 22న సుప్రీంకోర్టు విచారణ

న్యూఢిల్లీ, జూలై 19: అసెంబ్లీలు తీర్మానించిన బిల్లులను నిర్ణీత వ్యవధిలో ఆమోదించాలంటూ కోర్టులు రాష్ట్రపతికి గడువు విధించగలవా? అన్న సందేహాలపై సుప్రీంకోర్టు ఈ నెల 22న విచారణ జరపనుంది. ఇందుకోసం అయిదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటయింది. ఈ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ విక్రంనాథ్‌, జస్టిస్‌ పి.ఎ్‌స.నరసింహ, జస్టిస్‌ అతుల్‌ ఎస్‌ చందూర్కర్‌లు సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను ఆయా రాష్ట్రాల గవర్నర్లు ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపినప్పుడు వాటిపై మూడు నెలల్లోగా నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉందని ఏప్రిల్‌ 8న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. తమిళనాడు గవర్నర్‌ బిల్లులను ఆమోదించకుండా తొక్కిపెడుతున్నారన్న ఆరోపణలపై దాఖలైన కేసులో ఈ ఆదేశాలు ఇచ్చింది. అయితే న్యాయస్థానాలు రాష్ట్రపతికి ఈ విధంగా గడువు విఽధించగలవా అన్న సమస్య తలెత్తింది. దాంతో రాష్ట్రపతి ముర్ము రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 143(1) ప్రకారం ఈ సందేహాలు తీర్చాలని కోరుతూ సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. జులై 22న పంపిన ‘ప్రెసిడెన్షియల్‌ రిఫరెన్స్‌’లో 14 కీలకమైన ప్రశ్నలను ప్రస్తావించి అభిప్రాయాలు చెప్పాలని కోరారు. వీటిపైనే సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

తాడిపత్రిలో టెన్షన్‌ టెన్షన్‌

ప్రభుత్వ బడుల్లో నో వేకెన్సీ పరిస్థితి తేవాలి

Read latest AP News And Telugu News

Updated Date - Jul 20 , 2025 | 06:34 AM