Supreme Court: పార్టీలను స.హ.చట్టం పరిధిలోకి తేవాలా?
ABN , Publish Date - Feb 15 , 2025 | 06:07 AM
పార్టీలను స.హ.చట్టం పరిధిలోకి తీసుకురావాలంటూ దాఖలైన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌ల ధర్మాసనం ఈ నోటీసులు ఇచ్చింది.

మూడు పేజీలకు మించకుండా సమాధానం ఇవ్వండి
కేంద్రం, ఈసీ, ఆరు పార్టీలకు సుప్రీంకోర్టు నోటీసులు
పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసుపై విచారణ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలా అన్న అంశంపై లిఖితపూర్వక సమాఽధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, ఆరు జాతీయ రాజకీయ పార్టీలకు నోటీసులు ఇచ్చింది. పార్టీలను స.హ.చట్టం పరిధిలోకి తీసుకురావాలంటూ దాఖలైన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌ల ధర్మాసనం ఈ నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 21లోగా మూడు పేజీలకు మించకుండా లిఖితపూర్వక సమాఽధానాలు సమర్పించాలని ఆదేశించింది. అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్స్ రిఫార్మ్ష్ (ఏడీఆర్) అనే స్వచ్ఛంద సంస్థతో పాటు న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ ఈ పిటిషన్లను దాఖలు చేశారు.
ఇవి కూడా చదవండి...
PM Modi: ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం.. అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు
CEC: కొత్త సీఈసీ ఎంపికకు కసరత్తు.. 18న రాజీవ్ కుమార్ పదవీవిరమణ
Chennai: కమల్‌హాసన్‌తో ఉప ముఖ్యమంత్రి భేటీ..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.